దుప్పల్లి లో భగత్ సింగ్, రాజ్ గురు , సుఖదేవ్ ల 93వ వర్ధంతి కరపత్రం ఆవిష్కరణ - AIYF
అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి సందర్భం మండలంలోని దుప్పల్లి గ్రామంలో, AIYF స్తూపం వద్ద ప్రచార కరపత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ మాట్లాడుతూభగత్ సింగ్,రాజ్ గురు, సుకుదేవ్ ల వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల -AIYF, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 23 వ తేదీ నుండి ప్రారంభం వలిగొండ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ . ఆరూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది యువతను ప్రోత్సహించేందుకు వారిలో ఉన్న క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఏఐవైఎఫ్ వలిగొండ మండలంలోని మండల స్థాయి క్రికెట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నదని క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాము అని అన్నారు. భగత్ సింగ్ జీవితం భారత దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన భాద్యత పాలకులదేనని వారు ఉద్ఘాటించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. 75సంవత్సరాలు గడిచినా ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక వసతులు ఎందుకు కేటాయించలేకపోతున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధి అంటే మతాల మధ్య చిచ్చుపెట్టడమేనా అని వారు మోడీని ప్రశ్నించారు. దేశ ప్రధాని ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అందుకే మోసాల మోడీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలొనే భగత్ సింగ్ దేశానికి బ్రిటిష్ ముష్కరులతో పోరాడి స్వాతంత్య్రం తీసుకువస్తే, మోడీ ప్రజలను మోసం చేయడంలో, ప్రజల మధ్య చీలికలు తేవడంలో సిద్ధహస్తుడయ్యాడని వారు ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.డి నయీమ్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు ఎర్ర కిరణ్, సుద్దాల సాయికుమార్, ఏఐవైఎఫ్ మండల సమితి సభ్యులు మేడి దేవేందర్, మెట్టు లక్ష్మీనారాయణ, మామిడికాయల నరేష్, బాలగోని రాజు,మారోజు నరసిమాచారి, అంతటి రాము, రాపోల్ పవన్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి నరిగే యాదయ్య, తదితరులు పాల్గొన్నారు
Mar 19 2024, 16:55