కార్పొరేషన్ల ఏర్పాటుపై హర్షం ..ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్..

కార్పొరేషన్ల ఏర్పాటుపై హర్షం ..
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన దాసు సురేశ్..
ఆదివాసి దళిత బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ శనివారం వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ..
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తమ కార్యవర్గసభ్యులతో కలిసి గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు పాలక మండళ్ళను నియమించకుండా బీసీలు, అణగారినవర్గాల నాయకత్వాన్ని అణగదొక్కిన విషయాన్ని తెలియజేసిన వెంటనే తమ విజ్ఞప్తులకు స్పందించి కార్పొరేషన్లను ప్రకటించడం సబ్బండ వర్గాల అభ్యున్నతిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని, నిబద్ధతను తెలియజేస్తుందన్నారు..
ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో కులగలనను, బీసీ మైనార్టీ దళిత గిరిజన విద్యార్థులకు రెసిడెన్షియల్ గురుకులాలకు సమీకృత శాశ్వత భవనాలకు మంత్రివర్గ ఆమోదంతెలపడంతోబాటు నిధులను విడుదల చేయడం వాటిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం, టెట్ ను ప్రకటించడం లాంటి విషయాలన్నీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే సాధ్యమవుతున్నాయని దాసు సురేశ్ కితాబిచ్చారు..
బీసీలు దళితులు గిరిజనులు అణగారిన వర్గాల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రజాపాలనలో వారికి సముచిత ప్రాధాన్యతను ఇస్తూనే ఈ వర్గాల అవకాశాలను ఇనుమడింపజేసేలా సహకరించాలని కోరారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రజాపాలనలో పెద్ద ఎత్తున బిసి దళిత మైనార్టీ గిరిజనులకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు దాసు సురేష్ తెలిపారు.

 గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...
గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...

 దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్ 

 ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్... గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేసిన DRI అధికారుల

Mar 17 2024, 14:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.1k