ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ ప్రిన్స్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత అరెస్టుపై శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి , ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ , యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి , భువనగిరి జడ్పీటీసీ శ్రీ బీరు మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కొనలేకనే బిజెపి అరెస్టుల కు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ బిజెపిలు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల శాఖ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పంజాల సతీష్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కొలను దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అమరేందర్, బోడ్డు వెంకటేష్,మండల ప్రచార కార్యదర్శి పల్ల శ్రీనివాస్ రెడ్డి, BRS నాయకులు ఎర్ర శేఖర్ రెడ్డి, లక్ష్మీదేవి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు జీల్కపల్లి బలరాజ్ భువనగిరి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.








Mar 16 2024, 15:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.3k