తెలంగాణ రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ సేవా అవార్డు - 2024 పొందిన కొడారి వెంకటేష్, పద్మశ్రీ శాంత సిన్హా చేతుల మీదుగా ప్రధానం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "సంకల్ప్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు లలో "కమ్యూనిటీ సర్వీస్ అవార్డు-2024" కు భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఎంపికైనారు. శుక్రవారం హైదరాబాద్ లోని చందానగర్ లోని హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లో జరిగిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా కొడారి వెంకటేష్ అవార్డు ను అందుకున్నారు. "సంకల్ప్ ఫౌండేషన్ " ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో వివిధ రంగాలలో సేవలందించిన, మరియు ప్రత్యేక ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేశారు. ముఖ్యంగా వ్యవసాయ, చేనేత, పారిశుద్ధ్య, పారిశ్రామిక, మహిళా హక్కుల, మహిళా సాధికారత, పిల్లల హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ఆద్యాత్మిక ,తదితర అంశాలపై పనిచేసిన వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత దశాబ్ద కాలంగా, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం , మహిళా సాధికారత కోసం కృషి చేసిన కొడారి వెంకటేష్
రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పిల్లల హక్కుల కోసం, మహిళా సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న మా మార్గదర్శి పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా అవార్డును అందుకోవడం చాలా గర్వంగా, మరియు ఆనందంగా ఉందన్నారు. సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గండ్ర మేడం ఆద్వర్యంలో లభించిన ఈ అవార్డుతో సామాజిక భాద్యత మరింత పెరిగిందన్నారు. నాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎర్ర శివరాజ్, సూర్యాపేట జిల్లా పీపుల్స్ ఫౌండేషన్ డైరెక్టర్ యాతాకుల సునీల్ లు ఎక్సలెంట్ అవార్డులకు ఎంపికైనారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అవార్డు ఎంపికకు సహకరించిన వికారాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఇ. వెంకటేష్, సభ్యులు ధనసిరి ప్రకాష్ లకు కొడారి వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు
Mar 16 2024, 15:16