/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz తెలంగాణ రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ సేవా అవార్డు - 2024 పొందిన కొడారి వెంకటేష్, పద్మశ్రీ శాంత సిన్హా చేతుల మీదుగా ప్రధానం Vijay.S
తెలంగాణ రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ సేవా అవార్డు - 2024 పొందిన కొడారి వెంకటేష్, పద్మశ్రీ శాంత సిన్హా చేతుల మీదుగా ప్రధానం


 

 

 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "సంకల్ప్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు లలో "కమ్యూనిటీ సర్వీస్ అవార్డు-2024" కు భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఎంపికైనారు. శుక్రవారం హైదరాబాద్ లోని చందానగర్ లోని హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లో జరిగిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా కొడారి వెంకటేష్ అవార్డు ను అందుకున్నారు. "సంకల్ప్ ఫౌండేషన్ " ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో వివిధ రంగాలలో సేవలందించిన, మరియు ప్రత్యేక ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేశారు. ముఖ్యంగా వ్యవసాయ, చేనేత, పారిశుద్ధ్య, పారిశ్రామిక, మహిళా హక్కుల, మహిళా సాధికారత, పిల్లల హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ఆద్యాత్మిక ,తదితర అంశాలపై పనిచేసిన వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత దశాబ్ద కాలంగా, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం , మహిళా సాధికారత కోసం కృషి చేసిన కొడారి వెంకటేష్

రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పిల్లల హక్కుల కోసం, మహిళా సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న మా మార్గదర్శి పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా అవార్డును అందుకోవడం చాలా గర్వంగా, మరియు ఆనందంగా ఉందన్నారు. సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గండ్ర మేడం ఆద్వర్యంలో లభించిన ఈ అవార్డుతో సామాజిక భాద్యత మరింత పెరిగిందన్నారు. నాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎర్ర శివరాజ్, సూర్యాపేట జిల్లా పీపుల్స్ ఫౌండేషన్ డైరెక్టర్ యాతాకుల సునీల్ లు ఎక్సలెంట్ అవార్డులకు ఎంపికైనారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అవార్డు ఎంపికకు సహకరించిన వికారాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఇ. వెంకటేష్, సభ్యులు ధనసిరి ప్రకాష్ లకు కొడారి వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు

మోట కొండూరు మండల కేంద్రంలో మాన్యవార్ కాన్షిరాం జయంతి


యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మాన్యవార్ కాన్సిరాం జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఉద్యోగం వ్యక్తిగత జీవితం సంపాదన ఇంటిని ఇలా అన్నింటినీ వదిలేసి సమాజంలోని సబ్బండ వర్ణాలను కలిపి ఆనాడు భగవాన్ బుద్ధుడు చెప్పిన బహుజన హితాయ బహుజన సుఖాయ లక్ష్యం సాధించి చూపి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను నిజం చేసిన మహానుభావుడు కాన్సీరామ్ అని అన్నారు. సైకిల్ మీద తిరుగుతూ లక్షల మందిని కలిసి మహనీయుల మార్గంలో సమాజాన్ని నిర్మించిన ధీరుడు కాన్షిరాం. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ జిల్లా కార్యదర్శి కుసంగుల కుమార్ మండల కన్వీనర్ శ్రీను నరసింహ శ్రీకాంత్ భట్ల శ్రీను గంధ మల్ల నాని యాదగిరి కిష్టయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట ఆలయ ఈవో గా భాస్కర్ రావు నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు పై ప్రభుత్వం బదిలీ వేటి వేసింది. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రోటోకాల్ విషయంపై నిర్లక్ష్యం చేశాడు అని బదిలీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈఓ గా భాస్కర్ రావు నియామకం. యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తు సస్పెండ్ అయిన భాస్కర్ రావు  తిరిగి యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్


ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ గారిపై వ్యక్తిగతంగా అనవసరంగా మాట్లాడి దూషించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ 48 గంటల్లో చెప్పాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తలను సైకోలు అని సంబోధించడం విశారదన్ మహరాజ్ గారి కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం పై ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి జిల్లా కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మాట్లాడుతూ.....

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సిద్ధాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు... మహనీయుల పోరాట స్ఫూర్తితో ఏర్పడినటువంటి బహుజన వాదాన్ని పూటకో మాట మారుస్తూ సిద్ధాంతానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ పగ్గాలు విడిచి హిమాలయాలకు వెళ్లిపోవాలని రాజకీయ సన్యాసం తీసుకోవాలని తెలియజేస్తాము....

 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ నాగర్ కర్నూల్ లో పదివేల మంది కార్యకర్తలతో వచ్చి నువ్వు అగ్రకులాల పార్టీ లతో కలిసి చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరికీ తెలియజేసి నిన్ను ఓడకొట్టడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాను... 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్, నకిరేకంటి నరేందర్, ch వెంకటేష్ లు పాల్గొన్నారు....

నూతన వధూవరులను ఆశీర్వదించిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా 

భువనగిరి పట్టణ పరిధిలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ లో వలిగొండ మాజీ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్ ల కూతురు శిరీష - ప్రణయ్ ముధిరాజ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరుల ని ఆశీర్వదించిన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ . ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిజెపి అధ్యక్షులు బోళ్ల సుదర్శన్, మాటూరు కిట్టు, మాటూరు వెంకటేష్, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బిజెపి ప్రభుత్వమే: కొత్త రామ చంద్రు బిజెపి మండల నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కొత్త రామచంద్రు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంచేపట్టబోయేది బిజెపి ప్రభుత్వమే అని నరేంద్ర మోడీ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారంచేయబోతున్నారని ఆయన అన్నారు.ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఆర్థిక సంస్కరణలు గానీ అభివృద్ధి కార్యక్రమాలు గాని దేశ విదేశాల్లో భారతదేశ విశిష్టతను పెంపొందించి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు తెచ్చారని ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని కొత్త కొత్త ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల వారికి న్యాయం చేకూర్చాలని గత పది సంవత్సరాల కాలంలో దేశం పురోగతిని సాధించిందని, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తారని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.అందుకే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరొకసారి మోడినిప్రధానమంత్రిగా గెలిపించాలని అప్పుడే దేశం మరింత అభివృద్ధినిసాధిస్తుందని కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి, బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల వారికి సమన్యాయం జరుగుతుందని వారన్నారు.భువనగిరి పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నిలబడడం జరిగింది. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భువనగిరి గడ్డపై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని గెలిపించి దేశంలో భువనగిరి చరిత్రను తిరగ రాయాలని ఆయన అన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలి: MRPS


యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కోళ్ల జహంగీర్ మాదిగ బుధవారం డిసిపి రాజేష్ చంద్ర ని కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలని ఈ మధ్యకాలంలో అట్రాసిటీ కేసులైనటువంటి ఎఫ్ఐఆర్ కాగానే నిందితుని అరెస్టు చేయకుండా జాప్యం చేస్తూ వెంటనే అట్రాసిటి కేసు నమోదు కాగానే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే నిందితున్ని అరెస్ట్ చేసి శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

            

       

కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్


కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను పీసీసీ ఉపాధ్యక్షులు,యువ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేటాయించాలని సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) రాష్ట్ర అధ్యక్షుడు& ఓయూ జేఏసీ అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పార్టీ బలోపేతానికై అహర్నిశలు కృషిచేసిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారని ఆయన చేసిన కృషికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు పిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తే 3 లక్షల మెజార్టీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ఏడు నియోజకవర్గాల్లో కష్టపడి గెలుపుకై కృషి చేస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కష్టపడుతూ పార్లమెంట్ పరిధిలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేశారని అన్నారు.

ప్రజారోగ్యమే తమ లక్ష్యం; ముత్తిరెడ్డిగూడెం ఉచిత వైద్య శిబిరం లో ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్


గ్రామ ప్రజారోగ్యమే తమ లక్ష్యం అని ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్ ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంధ్య డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఉపయోగపడే పలు రకాల మందులను పంపిణీ చేశారు. అలాగే మున్ముందు కూడా ముత్తిరెడ్డిగూడెం గ్రామ స్వచ్ఛంద సేవ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్య బాగు కోసం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు సంతోషిస్తూ ఎంపిటిసి రాంపల్లి కృష్ణ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం


గత తొమ్మిదినరెండ్ల టిఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమలు తీవ్ర అన్యాయానికి గురి కావడం జరిగింది.18 శాతం ఉన్న గొల్ల కురుమలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

గొల్ల, కురుమలకు గొర్లు ఇచ్చి వాళ్ళని సామజికంగా, ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం BRS KCR పాలనలో జరిగింది.

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్ల కురుమల సమస్యల మీద ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొల్ల కురుమలను విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించి గొల్ల కురుమలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది, దానికి అనుగుణంగా గొల్ల కురుమల సమస్యల పైన మేనిఫెస్టో కమిటీ క చర్చించి అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 18 శాతం జనాభా కలిగిన కురుమలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది.

అంతే కాకుండా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో గొల్ల కురుమలు చట్టసభల్లో ప్రాతినిధ్య వహించాడానికి నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభ సభ్యుడు గా అవకాశం ఇచ్చింది.

 ఈ విధంగా ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమల అందరి తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 ఇదే స్ఫూర్తితో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ఎంతో కాలం నుండి వేచి చూస్తున్నా గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొని విద్యాపరంగా వెనుకబడినటువంటి తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

 గొల్ల కురుమల కుటుంబాలలో ఎంతోమంది యువతీ యువకులు డిగ్రీలు పీజీలు పూర్తిచేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్నారు, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు గాని, ఆర్థికంగా వెనుకబడిన పేదవాళ్లకు గానీ తమ జీవితంలో ముందుకు పోవడానికి కార్పొరేషన్ తోడ్పడుతుంది.

 కాబట్టి గౌరవ ముఖ్యమంత్రివర్యులు మరియు బీసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కార్పొరేషన్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకొని గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుతున్నామని బీర్ల ఐలయ్య గారు అన్నారు.