గాంధీభవన్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం
గత తొమ్మిదినరెండ్ల టిఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమలు తీవ్ర అన్యాయానికి గురి కావడం జరిగింది.18 శాతం ఉన్న గొల్ల కురుమలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు
గొల్ల, కురుమలకు గొర్లు ఇచ్చి వాళ్ళని సామజికంగా, ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం BRS KCR పాలనలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్ల కురుమల సమస్యల మీద ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొల్ల కురుమలను విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించి గొల్ల కురుమలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది, దానికి అనుగుణంగా గొల్ల కురుమల సమస్యల పైన మేనిఫెస్టో కమిటీ క చర్చించి అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 18 శాతం జనాభా కలిగిన కురుమలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది.
అంతే కాకుండా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో గొల్ల కురుమలు చట్టసభల్లో ప్రాతినిధ్య వహించాడానికి నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభ సభ్యుడు గా అవకాశం ఇచ్చింది.
ఈ విధంగా ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమల అందరి తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇదే స్ఫూర్తితో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ఎంతో కాలం నుండి వేచి చూస్తున్నా గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొని విద్యాపరంగా వెనుకబడినటువంటి తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
గొల్ల కురుమల కుటుంబాలలో ఎంతోమంది యువతీ యువకులు డిగ్రీలు పీజీలు పూర్తిచేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్నారు, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు గాని, ఆర్థికంగా వెనుకబడిన పేదవాళ్లకు గానీ తమ జీవితంలో ముందుకు పోవడానికి కార్పొరేషన్ తోడ్పడుతుంది.
కాబట్టి గౌరవ ముఖ్యమంత్రివర్యులు మరియు బీసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కార్పొరేషన్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకొని గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుతున్నామని బీర్ల ఐలయ్య గారు అన్నారు.
Mar 15 2024, 18:01