ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్
ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ గారిపై వ్యక్తిగతంగా అనవసరంగా మాట్లాడి దూషించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ 48 గంటల్లో చెప్పాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తలను సైకోలు అని సంబోధించడం విశారదన్ మహరాజ్ గారి కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం పై ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి జిల్లా కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మాట్లాడుతూ.....
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సిద్ధాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు... మహనీయుల పోరాట స్ఫూర్తితో ఏర్పడినటువంటి బహుజన వాదాన్ని పూటకో మాట మారుస్తూ సిద్ధాంతానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ పగ్గాలు విడిచి హిమాలయాలకు వెళ్లిపోవాలని రాజకీయ సన్యాసం తీసుకోవాలని తెలియజేస్తాము....
48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ నాగర్ కర్నూల్ లో పదివేల మంది కార్యకర్తలతో వచ్చి నువ్వు అగ్రకులాల పార్టీ లతో కలిసి చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరికీ తెలియజేసి నిన్ను ఓడకొట్టడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాను...
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్, నకిరేకంటి నరేందర్, ch వెంకటేష్ లు పాల్గొన్నారు....
Mar 14 2024, 18:03