కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బిజెపి ప్రభుత్వమే: కొత్త రామ చంద్రు బిజెపి మండల నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కొత్త రామచంద్రు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంచేపట్టబోయేది బిజెపి ప్రభుత్వమే అని నరేంద్ర మోడీ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారంచేయబోతున్నారని ఆయన అన్నారు.ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఆర్థిక సంస్కరణలు గానీ అభివృద్ధి కార్యక్రమాలు గాని దేశ విదేశాల్లో భారతదేశ విశిష్టతను పెంపొందించి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు తెచ్చారని ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని కొత్త కొత్త ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల వారికి న్యాయం చేకూర్చాలని గత పది సంవత్సరాల కాలంలో దేశం పురోగతిని సాధించిందని, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తారని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.అందుకే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరొకసారి మోడినిప్రధానమంత్రిగా గెలిపించాలని అప్పుడే దేశం మరింత అభివృద్ధినిసాధిస్తుందని కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి, బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల వారికి సమన్యాయం జరుగుతుందని వారన్నారు.భువనగిరి పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నిలబడడం జరిగింది. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భువనగిరి గడ్డపై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని గెలిపించి దేశంలో భువనగిరి చరిత్రను తిరగ రాయాలని ఆయన అన్నారు.
Mar 14 2024, 08:38