కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందించాలి: కొండమడుగు నరసింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వలోకి గోదావరి జలాలను అందించాలని ఇక్కడి ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం హనుమపురం గ్రామ పరిధిలో గల పంట పొలాలను గ్రామ శాఖ ఆధ్వర్యంలో పరిశీలన చేసి అనంతరం స్థానిక తాసిల్దార్ గారికి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హన్మాపురం గ్రామ రైతు అయినా ముద్దం కొమురయ్యకు సంబంధించిన వరి పంట పూర్తిగా భూగర్భ జలాలు తగ్గి ఎండు దశకు వచ్చిందని దీనిని అధికారులు పరిశీలించి అట్టి రైతులు ఆదుకోవాలని అదేవిధంగా దాదాపు 100 నుండి 200 ఎకరాలకు పైగా వరి పంట భూగర్భ జలాలు లేక ఎండిపోయే అవకాశం వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో భూగర్భ జలాలు లేక ప్రభుత్వాలు భూగర్భ జలాలను పెంచే విషయంలో దృష్టి పెట్టక రైతులు నష్టపోతున్నారని వారు అన్నారు. వరి పంటలు ప్రస్తుతం పొట్ట దశలోకి వచ్చిన సరిపడా నీరు లేక ఎండిపోతున్న క్రమంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారని వెంటనే అధికారులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా పంట సర్వే నిర్వహించి నష్టం జరిగిన పంటను అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకొని కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వలోకి గోదావరి సాగు జలాలను తీసుకొచ్చి చెరువులు కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో వరి పంటలతో పాటు సాగు పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు. వీరితోపాటు సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, ఏదునూరి మల్లేష్, కొండ అశోక్, పల్లెర్ల అంజయ్య, ఎల్లంల వెంకటేష్, మోటే ఎల్లయ్య, దండు గిరి, బందెల ఎల్లయ్య, బోడ ఆంజనేయులు, లక్ష్మయ్య, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, తోటకూరి నాగరాజు, కుసుమ మధు, రైతులు ముద్దం కొమురయ్య, పైళ్ల సత్తిరెడ్డి, బొబ్బల నర్సిరెడ్డి, ముద్దం కిష్టయ్య, బండి మల్లయ్య, జాన బాలకృష్ణ, కమ్మ శ్రీను, మోటే కిష్టయ్య, సోమ మహేష్ ఆమనగంటి శేఖర్, నాగపురి బాలరాజు, దుర్గం స్వామి, దుర్గం నరసింహ, గుండ్ల అనంతరెడ్డి, రాపోలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Mar 11 2024, 22:00