పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సిపిఎం డిమాండ్
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
ఎకరానికి 30 వేల నష్టపరిహారం ఇవ్వాలి తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా సందర్భంగా సిపిఎం డిమాండ్
వేసవి కాలం ఎక్కువ అవుతుండడంతో పంట పొలాలకు నిరంధక ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నష్టపరిహారం కింద వరి పంట ఎకరానికి 30 వేల రూపాయలు పరిహారాన్ని అందించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య డిమాండ్ చేశారు
ఈరోజు సిపిఎం జిల్లా వ్యాప్త పిలుపులో భాగంగా వలిగొండ తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వేసవికాలం ముదరడంతో రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వరి పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 30 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులందరిని గుర్తించి వెంటనే వారిని ఆదుకోవాలన్నారు ప్రభుత్వం కరువు పై వెంటనే స్పందించాలని సహాయక చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు మంచినీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పశువులకు గొర్రెలకు మేకలకు నీటి సౌకర్యం కల్పించేందుకు నీటి తొట్లను గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,చీర్క శ్రీశైలం రెడ్డి, కల్కూరి రామచందర్, మండల కమిటీ సభ్యులు మొగిలిపాక గోపాల్, కందడి సత్తిరెడ్డి, గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి,కొండే కిష్టయ్య నాయకులు రేపాక ముత్యాలు, రాధారపు మల్లేశం, పల్సం లింగం, బంధారపు ధనంజయ, దండెం నర్సిరెడ్డి, ఐతరాజు శంకరయ్య,కొండే నర్సింహ,కట్ట లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Mar 11 2024, 17:59