నేడు యాదాద్రి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యాదగిరిగుట్ట, భద్రా ద్రిలో పర్యటించారు. ముం దుగా ఆయన యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు..
ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మినర సింహ స్వామిని దర్శించు కున్నారు. యాదాద్రికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొ న్నారు.పట్టువస్త్రాలు సమర్శించిన రేవంత్…
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ సమర్పించారు.
సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భద్రాద్రి రామయ్య సేవలో..
యాదాద్రి నుంచి నేరుగా హెలికాప్టర్ లో సిఎం భద్రా చలం చేరుకున్నారు. అనం తరం శ్రీ సీతారామచంద్ర స్వామిని రేవంత్ దంపతు లు దర్శించుకున్నారు.
రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్య మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఉన్నారు...
Mar 11 2024, 16:17