స్త్రీలకు కావలసిన హక్కులు స్వేచ్ఛ సమానత్వం కల్పించాలి : కొడారి వెంకటేష్
ప్రపంచ వ్యాప్తంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, ఆర్థిక అసమానతలతో పాటు అనేక అంశాలలో వంచించ బడుతున్నారని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో బహుజన ఆడపడుచు, మూట కొండూరు మాజీ సర్పంచ్ వడ్డెబోయిన (వంగపల్లి) శ్రీలత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన శ్రీలత, పేదరికం చదువుకు ఆటంకం కాదని నిరూపించారని ఆయన అన్నారు. తాను ఉన్నత చదువులు చదివి, ప్రజా సేవ కొరకై రాజకీయ రంగంలో ప్రవేశించి, ఉత్తమ సేవలందించారని ఆయన తెలిపారు . స్ర్తీ లకు ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు , హక్కులు ఉంటాయని వాటి కోసం శ్రీలత నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పక్షపాతి, మహిళల హక్కుల కోసం, మహిళల చదువుకోసం తన జీవితాంతం కృషిచేసిన, సామాజిక ఉద్యమ నాయకురాలు, సంఘసంస్కర్త , చదువుల తల్లి సావిత్రి భాయి పూలే వర్థంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూట కొండూరు మాజీ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మాట్లాడుతూ నేడు మహిళలపై జరుగుతున్న దాడులకు, వేదింపులకు అనేక చట్టాలు ఉన్నా, అవి కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్ర్తీ, పురుష అసమానతలు, పౌష్టికాహారం లోపం, గృహ హింస, లైంగిక వేధింపులకు మహిళలు బలగుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వాలు స్త్రీ ల గురించి చేసే చట్టాలలో అనేక మార్పులు తేవాలని, గృహహింస, లైంగిక వేధింపులకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్, భువనగిరి స్టేషన్ మేనేజర్ రత్నయ్య, కంట్రోలర్ సోమరాజు, డాక్టర్ కొండా సోమయ్య, డాక్టర్ కొండా మురళి మోహన్, వంగపల్లి యువసేన నాయకులు శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Mar 11 2024, 11:43