గోకారం పెద్దమ్మతల్లి మహిళ మత్స్య పారిశ్రామిక సహకార పాలకమండలి అధ్యక్షురాలుగా నూకల స్వాతి ఎన్నిక
![]()
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా.
వలిగొండ మండలం గోకారం గ్రామంలో ఇదివరకే ఒక మత్స్య సొసైటీ ఉండగా, తాజాగా పెద్దమ్మ తల్లి మహిళా మత్స్య సహకార పాలకమండలి ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ఒక గ్రామంలో రెండు సొసైటీలు ఉండడం అరుదైనది కాగా, సంఘాలను ఏర్పాటు చేయడంలో ముదిరాజ్ మహాసభ నాయకులు నూతి చలపతి ముదిరాజ్ పాత్ర కీలకమైనదిగా చెప్పవచ్చు. గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి మహిళ మత్స్య పారి శ్రామిక సహకార సంఘం పాలకమండలి అధ్యక్షురాలుగా శ్రీమతి నూకల స్వాతి ఎన్నిక కాగా,ఉపాధ్యక్షురాలుగా బుంగపట్ల నాగమణి, కార్యదర్శిగా నూకల కావ్య ఎన్నిక కాగా,
సభ్యులుగా కట్ట ప్రమీల, రొయ్యల కావ్య, మేడగొని మారమ్మ,రొయ్యల అంజమ్మ, కట్ట లావణ్య, కట్ట అండాలు, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చలపతి తెలిపారు .ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన నూకల స్వాతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా ఏర్పాటైన ముదిరాజ్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామంలోని ముదిరాజ్ మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు .సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తమ సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న పెద్దలు ముదిరాజ్ మహాసభ గోకారం మత్స్య సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు నూతి చలపతికి ధన్యవాదాలు తెలిపారు. తమ సంఘం ముందుకు నడవడానికి పూర్తి సహకారాన్ని అందజేయవలసిందిగా వారు కోరారు. ఈ సందర్భంగా నూతి చలపతి ముదిరాజ్ మాట్లాడుతూ' ముదిరాజులే మత్స్యకారులు" "మత్స్యకారులే ముదిరాజులు' అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా గోకారం గ్రామంలో రెండు సొసైటీలను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించడం జరిగిందని అన్నారు .ఇవి ముదిరాజ్ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
![]()






వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని




Mar 10 2024, 00:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.4k