యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాలు ,సినిమా ప్రోగ్రాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని, అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నామని, రోడ్లకి అనుమతి ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వం 6 వేల పాఠశాలలు మూసి వేశారని, మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తో అన్ని వర్గాల వారు సంతోషంతో ఉన్నారన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రాలేదు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణం పై విచారణ చేస్తామని అన్నారు.
![]()
![]()







యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పై సస్పెన్షన్ వేటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను ఉల్లంఘించి ,భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తన బదిలీని తప్పించుకున్నందుకు ,విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు, సస్పెండ్ చేస్తూ ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.



Mar 06 2024, 14:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.9k