/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz టీజేఎస్ లో చేరిన బిఎస్పి నాయకులు Raghu ram reddy
టీజేఎస్ లో చేరిన బిఎస్పి నాయకులు


 

 తెలంగాణ జన సమితి పార్టీ విధానాలు నచ్చి పనిచేయుటకు ముందుకు వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు జి నాగేశ్వరరావు, మునుగోడు నియోజకవర్గ నాయకులు మల్గా యాదయ్య, నారీ బలరాజు కు నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రొఫెసర్ కోదండరాం సార్ కండువలు కప్పి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్గొండ జిల్లా పార్టీ బలోపేతం చేయుటకు కృషి చేయాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్  నల్గొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, కార్యదర్శి పులి పాపయ్య, సర్దార్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జన సమితి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుటకు అవినీతి లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పనిచేస్తున్న తెలంగాణ జన సమితిలో ఉద్యమకారులు మేధావులు నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ జన సమితిని మరింత బలోపేతం చేయుటకు పార్టీలో చేరాలని కోరినారు.

ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతి

విద్యార్థులు తన ఉపాధ్యాయులతో నిర్వహించుకునే ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతిని మిగుల్చుతుందని గీతాంంజలి పాఠశాల కరస్పాండెంట్ మారోజు భారతి విజయ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

2008-09 సంవత్సరపు విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

బాల్యంలో తల్లిదండ్రులు గురువులైతే విద్యాబోదనతో పాటు సమాజంలో మెలకువలను నేర్పేది ఉపాధ్యాయులని అన్నారు.

పట్టుదలతో చదివిన ప్రతి ఒక్కరు నేడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. మున్ముందు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇస్మాయిల్,ఊటుకూరి రవీందర్, దామళ్ళ యల్లయ్య,గంట యల్లయ్య,విజయ,నిర్మల,పూర్వక విద్యార్థులు వినయ్,అశోక్,ఖాలేద్ తదితరులు పాల్గొన్నారు.

కమలం గూటికి బిఆర్ఎస్ కీలక నేత

వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే రమేష్ పార్టీ మారుతుం డటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టే అవుతుం దని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోం ది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతు న్నారు.

అయితే ఆరూరి రమేష్‌తో బీఆర్ఎస్ అగ్ర నేతలు బుజ్జగించేందుకు ప్రయ త్నిస్తున్నారు. మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రమేష్‌ను బుజ్జగించే బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది.

కానీ ఆయనని బుజ్జగిం చేందుకు కడియం అంగీ కరించలేదు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను బీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వ రాజు బుజ్జగిస్తున్నారు.

అయితే రమేష్ పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు 15మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే.

అయితే రమేష్ కూడా పార్టీ మారుతుండటంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కకావికలం అవుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. కానిస్టేబుల్‌ సహా మహిళా మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయి స్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిసింది.. 

కాంకేర్‌ జిల్లాలోని హిదూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచా రంతో పోలీసులు, బీఎస్ ఎఫ్ దళాలు, ఆపరేషన్ చేపట్టాయి.

ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయి స్టులు కాల్పులు ప్రారం భించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో కాని స్టేబుల్ రమేశ్‌, ఓ మహిళా మావోయిస్టు చనిపోయారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నది.

పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

గత నెలలో జరిగిన వివాదాస్పద ఎన్నికల తర్వాత పాకిస్తాన్ శాసనసభ్యులు షెహబాజ్ షరీఫ్‌ను దేశ ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు.

పాక్ ప్రధానిగా షెహబాబ్ వరుసగా రెండో సారి పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ పార్లమెంట్ లో షెహబాబ్ కు 201 మంది మద్దతు పలికారు. పిఎంఎల్-ఎన్, పిపిఏ కూటమికి చెందిన చెందిన షెహబాబ్ పాక్ ప్రధానిగా ఎన్నికైయ్యారు.

పిటిఐ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు 92 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఫిబ్రవరి 8న ఓటింగ్‌లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, ఆలస్యమైన ఫలితాల ఆరోపణలతో ఓటింగ్ జరిగింది. ఆదివారం, జాతీయ అసెంబ్లీ, పార్లమెంటు దిగువ సభగా పిలువబడే విధంగా, ప్రధానమంత్రిని ఎన్నుకో వడానికి సమావేశ మైంది.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: భోగ శ్రావణి

రాయికల్ మండలం అల్లీపూర్ లో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి ఆదివారం టాస్ వేసి ప్రారంభించారు.

అనంతరం సరదాగా బ్యాటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ యూత్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు.

కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలం గాణలో రాజకీయ పరిణా మాలు మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు...

జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పిన గడ్డికొండరాం పార్టీ కార్యకర్తలు

గడ్డి కొండారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి గారికి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చెన్నపాక శ్యామ్, ఉపాధ్యక్షులుసున్నం నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు భూపతి రాజు, మైనం నాగేందర్, పాలడుగు అంజనేయులు,నర్సింగ్ కృష్ణ, దొడ్డిని వెంకన్న, కందుల అశోక్, చెన్నపాక చంద్ర శేఖర్, సుంకిశాల ప్రశాంత్, కంచర్ల రమేష్ రెడ్డి, కందిమల్ల వేణుగోపాల్ రెడ్డి, భీమనపల్లి జానయ్య, భీమనపల్లి,శ్రీను, జక్కలి సతీష్, కస్పరాజు సైదులు, కస్పరాజు అనిల్, ముంత రాజు, మైనం దాసు, బుయ్య సైదులు, సుకింశాల ఇస్తారి, దూదిమెట్ల మహేష్, కస్పరాజు సత్తయ్య, నాంపల్లి వెంకన్న,జక్కలి రామలింగం, మహిళా కార్యకర్త, భీమనపల్లి మమత, మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా శ్రీపాదరావు పోషించిన పాత్ర మరువ లేనిదని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దుద్దిళ్ల శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించిన ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పితామ హుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు రాజకీయ ప్రస్థానం మంథని నుండి మొదలు అయిందని తెలిపారు. చరిత్రలో పివికి, మంథని నియోజకవర్గనికి చాలా ప్రాముఖ్యత ఉందని, పివి అనుచరుడుగా శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం మొదలు అయింది అదే మంథని స్థానం నుండని ముఖ్యమంత్రి అన్నారు.

శ్రీపాద రావు స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రములో మంచి సంప్రదాయం నెలకొలిపారని కొనియాడారు. అసెంబ్లీ అంటే నాయకుల మధ్య గొడవ జరిగే ప్రదేశం కాదు, ప్రజల సమస్యలు ప్రస్థా వించే వేదిక అని నిరూపిం చారని కొనియాడారు.

ఇప్పుడు అసెంబ్లీ వ్యవ హారాల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చూసారని కితాబునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎన్‌టిఆర్ శ్రీపాదరావు స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నికకు సహ కరించారని గుర్తు చేశారు.

శ్రీధర్‌బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటి సారి శ్రీపాద రావు తనయుడుగా గెలిచిన ఆయన ఆ తర్వాత ప్రతిభ, పనితనం వల్లే శ్రీధర్‌బాబు అనేక సార్లు గెలిచారన్నారు. అసెంబ్లీలో ఎవరం గొంతు విప్పాలన్నా శ్రీధర్ బాబు అనుమతి లేదా సైగ కావాలని రేవంత్ రెడ్డి సమత్కరించారు.

తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని అన్నారు. ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలని ఆ మేరకు ఆలోచన ఉందన్నారు. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటును పరిశీలిస్తామని, ఇందుకోసం త్వరలోనే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

జీవన్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, ఇతర ప్రముఖులు కోరినట్టు హైదరాబా లో తప్పకుండ శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు విధివిధానాలు రూపొందిస్తామన్నారు...

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర

విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర (Maha Padayatra) ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది..

ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే నాగి రెడ్డి, పలు రాజకీయ పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలన్నారు..

కాగా విశాఖ ఉక్కును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ అన్నారు. గురువారం గుడివాడలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఆయన రాస్తారోకో చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కార్మిక ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ముఠా కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు..