నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
NEP కి వ్యతిరేకంగా AISF ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో సంతకాల సేకరణకు మద్దతు తెలిపి అడ్డగూడూరు మండలంలో సంతకాల సేకరణను ప్రారంభించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు*
అనంతరం ఎమ్మెల్యే సామేల్ గారు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ ....
విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించాలని కోరారు.
విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని అన్నారు.
ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయికరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి బదులు హిందుత్వ రాజ్యాన్ని స్థాపించడానికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు ఇటుకల చిరంజీవి గారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్ , వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ, అడ్డగూడూరు మండల నాయకులు కళ్యాణ్, లోకేష్ , వంశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mar 04 2024, 21:16