రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేక వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ అస్తవ్యస్యం; దంతూరి సత్తయ్య గౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం బోర్డు మెంబర్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ లో రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేక ఇంచార్జి కార్యదర్శితో పాలన సాగిస్తున్న గ్రామపంచాయతీ వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ పరిధిలోని వివిధ పనులను అస్తవ్యస్తంగా ఇంచార్జి పాలనలో నడిపిస్తున్న రని ఆదివారం రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వలిగొండ మండలం జిల్లాలోని 37 గ్రామపంచాయతీలు గల పెద్ద మండలం అని అందునా వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ కావడం మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇళ్ల నిర్మాణాలు తదితర పనుల నిమిత్తం వలిగొండలో నివసిస్తూ ఉంటారు. ఈ మేజర్ గ్రామపంచాయతీకి గత రెండు సంవత్సరాలుగా ఇంచార్జి కార్యదర్శి తో పాలనను జిల్లా అధికారులు నడిపిస్తున్నరని ఆయన అన్నారు.
వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పట్టించుకోని అధికారులని ఆయన అన్నారు. వేసవికాలంలో నీటి ఎందడి ఏర్పడుతుందని ఈ విషయంపై భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా వలిగొండ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని నియమించి మేజర్ గ్రామపంచాయతీలో గల పలు సమస్యలపై దృష్టి సారించి నీటి ఎందడి నివారించగలరని ఆయన అన్నారు. వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఈ ఇళ్ల నిర్మాణాల అనుమతిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఈ అవకతవకలను అరికట్టాలంటే మేజర్ గ్రామపంచాయతీ అయిన వలిగొండకు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించాలని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన వలిగొండ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించి వలిగొండ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరగకుండా పాలనను సజావుగా నడిపించే విధంగా చూడాలని ఆయన కోరారు.
Mar 03 2024, 19:39