కమలం గూటికి బిఆర్ఎస్ కీలక నేత
వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే రమేష్ పార్టీ మారుతుం డటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టే అవుతుం దని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోం ది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతు న్నారు.
అయితే ఆరూరి రమేష్‌తో బీఆర్ఎస్ అగ్ర నేతలు బుజ్జగించేందుకు ప్రయ త్నిస్తున్నారు. మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రమేష్‌ను బుజ్జగించే బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది.
కానీ ఆయనని బుజ్జగిం చేందుకు కడియం అంగీ కరించలేదు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను బీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వ రాజు బుజ్జగిస్తున్నారు.
అయితే రమేష్ పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు 15మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే.
అయితే రమేష్ కూడా పార్టీ మారుతుండటంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కకావికలం అవుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...
Mar 03 2024, 19:21