యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం యాదగిరిగుట్ట డిపో దగ్గర కార్మికులు యూనియన్ల కు అతీతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ టీ ఎస్ ఆర్టీసీ ని, ప్రభుత్వం లో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీల డబ్బులు వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బంద్ కాలం నాటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలియజేయుట కొరకే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని వారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికుల పక్షపాతిగా, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు మురళి, కృష్ణయ్య, కుమార్, రమేష్ ,యాదగిరి, నగేష్, వెంకటేష్, కార్మికులు పాల్గొన్నారు.
Mar 03 2024, 16:00