ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా శ్రీపాదరావు పోషించిన పాత్ర మరువ లేనిదని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
దుద్దిళ్ల శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించిన ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పితామ హుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు రాజకీయ ప్రస్థానం మంథని నుండి మొదలు అయిందని తెలిపారు. చరిత్రలో పివికి, మంథని నియోజకవర్గనికి చాలా ప్రాముఖ్యత ఉందని, పివి అనుచరుడుగా శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం మొదలు అయింది అదే మంథని స్థానం నుండని ముఖ్యమంత్రి అన్నారు.
శ్రీపాద రావు స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రములో మంచి సంప్రదాయం నెలకొలిపారని కొనియాడారు. అసెంబ్లీ అంటే నాయకుల మధ్య గొడవ జరిగే ప్రదేశం కాదు, ప్రజల సమస్యలు ప్రస్థా వించే వేదిక అని నిరూపిం చారని కొనియాడారు.
ఇప్పుడు అసెంబ్లీ వ్యవ హారాల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చూసారని కితాబునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎన్‌టిఆర్ శ్రీపాదరావు స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నికకు సహ కరించారని గుర్తు చేశారు.
శ్రీధర్‌బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటి సారి శ్రీపాద రావు తనయుడుగా గెలిచిన ఆయన ఆ తర్వాత ప్రతిభ, పనితనం వల్లే శ్రీధర్‌బాబు అనేక సార్లు గెలిచారన్నారు. అసెంబ్లీలో ఎవరం గొంతు విప్పాలన్నా శ్రీధర్ బాబు అనుమతి లేదా సైగ కావాలని రేవంత్ రెడ్డి సమత్కరించారు.
తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని అన్నారు. ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలని ఆ మేరకు ఆలోచన ఉందన్నారు. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటును పరిశీలిస్తామని, ఇందుకోసం త్వరలోనే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
జీవన్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, ఇతర ప్రముఖులు కోరినట్టు హైదరాబా లో తప్పకుండ శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు విధివిధానాలు రూపొందిస్తామన్నారు...
Mar 03 2024, 14:04