/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png
చిత్తాపురం శివాలయం గుడికి విరాళం అందజేసిన మేడి కుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం శివాలయం గుడిలో శివరాత్రి ఉత్సవాలకు గోపరాజు పల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మేడి కుమార్ శివాలయం గుడికి పదివేల రూపాయలు విరాళంగా కల్లూరి శ్రీనివాస్ స్వామి ,చేగురి మహేష్ కు అందజేయడం జరిగింది.
గోకారం గ్రామంలో మహిళ మిస్సింగ్ కేసు నమోదు... వలిగొండ ఎస్సై మహేందర్ లాల్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలో మహిళ మిస్సింగ్ అయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన నారి అశోక్ చిన్న కుమార్తె నారి మనిషా , విడాకులు తీసుకుని ఇంటి వద్ద ఉంటుంది. ఈనెల 23న సూర్యాపేటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి ఈనెల 28 బుధవారం గోకారం బయలుదేరారు . మనిషా ఇంటికి చేరుకోకపోగా ,తండ్రి గ్రామంలో ,చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభించలేదు. మనిషా తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని గురువారం ఉదయం ఎనిమిది గంటలకి వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.
విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కావద్దు: ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్, దేశి రెడ్డి వెంకట్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక, పహిల్వాన్ పురం గ్రామాలలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున దేశి రెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వారికి వివరించడం జరిగింది. పరీక్ష సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి, స్ట్రెస్ కు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. మనం వచ్చింది వచ్చి పోవడానికి కాదు ఏదైనా ఇచ్చి పోవడానికి అని తెలియజేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నల్లగొండ ఇంచార్జ్ నూనె సుదర్శన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక ప్రధానోపాధ్యాయులు గంగ దారి బిక్షపతి, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, వరమ్మ, పహిల్వాన్ పురం ఉపాధ్యాయులు గురు ప్రసాద్, కృష్ణమూర్తి, విమల, అండాలు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్ర ,సాంకేతిక రంగాల పట్ల అవగాహన: మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, న్యాయవాది: కొండూరు బాలరాజు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని montessori లో
సైన్స్ ఫేర్ లతో విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెరుగుతుందని పాఠశాల డైరెక్టర్,న్యాయవాది
కొండూరు బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సర్ సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజు ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుతారనీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పర్యావరణ, అటవీ,గ్లోబల్ వార్మింగ్ , చంద్రాయన్ అంతరిక్ష నమూనాలతో పాటు వివిధ సైన్స్ ప్రదర్శనలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించగా సైన్స్ ఫెయిర్ లోని నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం.థామస్ అబ్రహం, అనూప్, సాండ్రా, మహేష్, జేరిన్, మనూ, డార్లి, కావ్య, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నిక
యాంకర్ పార్ట్; భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బుధవారం 11 గంటలకి నిర్వహించారు. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ ,వైస్ చైర్మన్ లపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు నిర్వహించిన భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో భువనగిరి పట్టణం 29 వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనారు. భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కి 18 మంది చేతులెత్తి మద్దతు తెలిపినారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ప్రకటించారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలియజేశారు.
వెలువర్తి గ్రామంలో కిడ్నాపర్ల భయాన్ని తొలగించి, అవగాహన కల్పించిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో మంగళవారం రాత్రి వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజల్లో కిడ్నాపర్ల గురించి భయాన్ని తొలగించి, నేరాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఈరోజు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో తిరుగుతుంటే గ్రామస్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి అప్పగించారని అన్నారు. కిడ్నాపర్ల గురించి గ్రామస్తుల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ..గ్రామస్తులు, యువకులతో కలిసి గ్రామంలో తిరిగామని అన్నారు. ఇటీవల దొంగతనాలు పెరిగాయని దొంగతనాలు పట్ల , నేరాలు సైబర్ నేరాల గురించి ప్రజలకి అవగాహన కల్పించామని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు రాష్ట్ర,ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వనికి,గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి,మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం రోజు రాష్ట్ర సచివాలయంలో 500కే గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.జీవో రిలీస్ చేసినందుకు గ్యారెంటీల అమలుకు దశ దిశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
స్వరాజ్య పాదయాత్ర స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకుందాం :. ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్
ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ చేసిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర స్ఫూర్తితో బిసి,ఎస్సి,ఎస్టీలు రాజ్యాధికారాన్ని సాధించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వినర్ నల్ల నరేందర్ అన్నారు. స్వరాజ్య పాదయాత్ర జిల్లా కేంద్రానికి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నందున స్థానిక హైదరాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శిలా పలకానికి పులు వేశారు. ఈ సందర్బంగా నరేందర్ మాట్లాడుతూ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సగాలని తెలిపారు. వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన కులాల ప్రజలకు రాజ్యాధికారం వల్ల మాత్రమే వారికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తే భారత దేశం భూతల స్వర్గం అవుతుందని అన్నారు. కాని ఈ అగ్రవర్ణ పార్టీలు ఎప్పటికి ఆ పని చేయవన్నారు. అందుకే 93 శాతంగా ఉన్న మనమంతా ఏకమైతే మన స్వరాజ్యం ఏర్పడితుందని, అప్పుడు మనమే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసుకునే వీలుంటుందన్నారు. రాజ్యాధికార లక్ష్యంతొనె ధర్మ సమాజ్ పార్టీ ఏర్పడిందన్నారు. డిఎస్పీ పార్టీలో చేరి మన బావి తరాల భవిష్యత్ మార్చుందన్నారు. ఈ కార్యక్రమంలొ జిల్లా కో కన్వినర్ సందేల మహేష్, జిల్లా నాయకులు వెల్వర్థి శ్రీకాంత్, జమ్ముల శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 28 నుండి జరుగు ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల పరీక్ష సమయానుకూలంగా బస్సులు నడపాలి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ
ఈనెల 28 నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు సమయానుగుణంగా బస్సులు గ్రామాల నుండి పట్టణాల వరకు నడపాలన్నారు కనీసం కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్న రానట్టి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం వెంటనే ఇది సరి చేయాలన్నారు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు అయిపోయేంతవరకు అన్ని గ్రామాలకు పరీక్షల సమయానుకూలంగా మరిన్ని బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘంగా తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్, మైసొల్ల నరేందర్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.
Mar 01 2024, 17:37