సిద్దిపేట జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు
సిద్దిపేట జిల్లాలో బుధ వారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యా ర్థులకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జరిగింది. సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
జిల్లావ్యాప్తంగా 11,039 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,328 (94 శాతం) మంది హాజరు కాగా. 711 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులకు సంబంధించి 8864 మందికి గాను 8419 మంది (95 శాతం) హాజరు కాగా 95 మంది గైర్హాజరయ్యారు.
ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 2175 మందికి గాను 1909 మంది (88 శాతం) హాజరు కాగా 88 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రగతి ఒకేషనల్ కళాశాల, న్యూ జెనరేషన్ కళాశాల, ఎన్సాన్ పల్లి టీఎస్ డబ్ల్యూఆర్ జే సీ కళాశాల పరీక్షా కేంద్రాలను డీఐఈవో సూర్య ప్రకాష్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
అదే విధంగా పోలీస్ కమిషనర్ డా. బీ అనురాధ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శిం చి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Feb 29 2024, 18:34