సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్ర ,సాంకేతిక రంగాల పట్ల అవగాహన: మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, న్యాయవాది: కొండూరు బాలరాజు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని montessori లో
సైన్స్ ఫేర్ లతో విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెరుగుతుందని పాఠశాల డైరెక్టర్,న్యాయవాది
కొండూరు బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సర్ సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజు ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుతారనీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పర్యావరణ, అటవీ,గ్లోబల్ వార్మింగ్ , చంద్రాయన్ అంతరిక్ష నమూనాలతో పాటు వివిధ సైన్స్ ప్రదర్శనలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించగా సైన్స్ ఫెయిర్ లోని నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం.థామస్ అబ్రహం, అనూప్, సాండ్రా, మహేష్, జేరిన్, మనూ, డార్లి, కావ్య, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
Feb 28 2024, 21:29