భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి :ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి
![]()
భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు .
మంగళవారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం మండల కార్యాలయంలో మద్దెల రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జహంగీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో బునాది గాని కాలవ లో నీరు లేకపోవడం వల్ల దానిపై ఆధారపడ్డ సుమారు 10 గ్రామాల్లో వరి పంటను సాగు చేస్తున్న రైతులు నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతులందరిని ఆదుకోవాలని మరొకవైపున నీరు సక్రమంగా లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులందరినీ గుర్తించి ఎకరానికి 20 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు బీబీనగర్ మక్తఅనంతారం గ్రామం వద్ద మూసి నీటిని బునాది గాని కాలువలోకి మళ్లించి పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడాలని కరెంటు కోతలు లేకుండా 9 గంటల కరెంటును ఇవ్వాలని డిమాండ్ చేశారు.
...ఫిబ్రవరిలోనే నీటి ఎద్దడి ఈరకంగా ఉందిని మార్చి ఏప్రిల్ లో మరింత ఎక్కువవుతుందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని రైతాంగానికి సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెడుతున్న మోడీ బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు
![]()
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపళ్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, గణపతి రెడ్డి,మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, మొగిలిపాక గోపాల్, గాజుల ఆంజనేయులు,వాకిటి వెంకటరెడ్డి,కందడి సత్తిరెడ్డి ఏలే కృష్ణ,కల్కూరి ముత్యాలు,కర్ణకంటి యాదయ్య,బుగ్గ చంద్రమౌళి,దుబ్బ లింగం,కవిడే సురేష్,భీమనబోయిన జంగయ్య,తదితరులు పాల్గొన్నారు.
![]()






ఉద్యోగాలులేక, ఉపాధి అవకాశాలులేక వలసలు పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. దేశానికి గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తిని ప్రభుత్వాలు నేరస్థులుగా, ఉగ్రవాదులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని, తద్వారా రాజకీయాలపట్ల విముఖత కలిగేటట్లు యువతను తయారుచేస్తూ సంఘవిద్రోహ శక్తులు, అవినీతిపరులు, దోపిడీదారులు రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని, ప్రజలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశ భవిష్యత్తును నవయవ్వనంతో తొణికిసలాడే యువత సరికొత్త భారతాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని ఏ ఐ వై ఎఫ్ ఈ సదస్సు ద్వారా పిలుపునివ్వబోతున్నదని వారు స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వ కాషాయీకరణను జతచేసి వీటిని వేగంగా అమలుచేయుటకు కేంద్ర ప్రభుత్వం "జాతీయ విద్యా విధానం - 2020” ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని, విద్యార్థుల మెదళ్ళను మొద్దుబార్చి, విద్వేషపు మత్తులో ముంచుటకు అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాల్లోకి చొప్పించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని,అందుకే పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తున్నదని ధ్వజమెత్తారు.రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజకీయ పార్టీల పై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని, విభజించు పాలించు అనే నినాదంతో పబ్బం గడపాలనే మోడీ దుష్ట నీచ రాజకీయాలకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశ యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు అన్నారు.

Feb 27 2024, 16:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.0k