కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం 6 మంత్రి పదవులను, 10 ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దా సురేష్ డిమాండ్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలుపడం హార్షనీయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు.. శనివారం బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయం నందు ఏర్పాటు చేసిన తెలంగాణ మేధావుల మేధోమధన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు..
సభాధ్యక్షత వహించిన దాసురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం అస్పష్టంగా ఉందని తీర్మానం కాకుండా దీనికి జ్యూడిషల్ కమిషన్ లేదా ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ ప్రజానీకానికి మరింత ఉపయోగంగా ఉండేదన్నారు.. తెలంగాణలో ప్రభుత్వం మారినా నేటికీ బీసీలపై అవకాశాలపరంగా వివక్ష కొనసాగుతూనే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులు దక్కగా కాంగ్రెస్ పాలనలో నేడు కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే బీసీల చేతుల్లో ఉన్నాయన్నారు.. బీసీలకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తున్నామన్నారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తామన్న కులగణకుకు చట్టబద్ధత లేకపోవడంవలన ప్రజాధనం నిష్ప్రయోజనమయ్యే అవకాశముందన్నారు .. అసెంబ్లీ తీర్మానం కంటే కులగణనను చట్టం చేయడం మరింత మెరుగైన విధానం అని దాసు సురేశ్ తెలిపారు. 2016లో కర్ణాటకలో 160 కోట్లతో 45 రోజులు లక్షా అరవై వేల మందితో నిర్వహించిన కులగణన ఫలితాలు నేటికీ బయటకు రాక ఫలితాలు ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడకపోవడాన్ని ఒకసారి పరిశీలించాలన్నారు.
రాష్ట్రంలో ఆస్తులు అగ్రవర్ణాలకు , అప్పులు బలహీన్న వర్గాలకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటివరకు రాష్ట్ర అప్పు 7.33 లక్షల కోట్లు కాగా కాళేశ్వరంలో అదనపు టిఎంసి కోసం వెచ్చించింది 1,40,000 కోట్లు అయితే ప్రతి సంవత్సరం అప్పుల వడ్డీకి చెల్లించడానికి 14000 కోట్లు ఖర్చు అవుతుండగా దీని భారం బలహీనవర్గాల మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన విధంగా ఐదు సంవత్సరాలకు గాను బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ను కేటాయిస్తామని, నిధులను సబ్ ప్లాన్ లో చేరుస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీ ఏమయిందని దాసురేష్ ప్రశ్నించారు.. ఈ హామీ ప్రకారం ఈ వార్షిక బడ్జెట్లో చేర్చాల్సిన 20 వేల కోట్లకు గాను కేవలం 8000 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమానికి వినియోగించడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు..
బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కంటే మెరుగ్గా పనిచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీసీలకు కేటాయించిన నాలుగు మంత్రి పదవులు అయినా ఎందుకు కేటాయించలేక పోతుందని ప్రశ్నించారు.. మంత్రి పదవులకు ప్రాతినిధ్యం లేని కులాలకు చెందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్, వీర్లపల్లి శంకర్, బీర్ల ఐలయ్య , మఖన్ సింగ్, ఆది శ్రీనివాస్ లేదా అపారమైన అనుభవం ఉన్న మహేష్ కుమార్ గౌడ్ లకు ఎందుకు అవకాశం కల్పించరని ప్రశ్నించారు..
బీసీ ఉద్యమ నేత విజిఆర్ నారగోని అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలే తప్ప అవినీతి అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.. ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు ఉన్నత స్థాయి పదవులను కేవలం ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం , ప్రాతినిధ్యం ఇవ్వడం సమసమాజ నిర్మాణానికి విఘాతకమన్నారు..ఇతర వర్గాలకు సమర్ధత లేదా అని ప్రశ్నించారు..సీఎంఓలో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఎందుకు లేదన్నారు ..?
మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , గురుకుల పాఠశాలలకు సమీకృత భవనాలను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో కాలపరిమితిని తెలపాలన్నారు.. ఆదిలాబాద్,నిజామాబాద్,రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లా నుండి ఒక్క మంత్రి లేకపోవడం పరిపాలన సౌభ్యానికి ఇబ్బంది కలుగుతుందని తెలియజేశారు.. అనుభవజ్ఞుడైన ఆకునూరి మురళి (ఐఏఎస్) లాంటి వారిని కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిజిపి మహేందర్ రెడ్డి కి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం దేనికి నిదర్శనం అన్నారు.. పాత నియామకాలే తప్ప కొత్త నోటిఫికేషన్లు ప్రభుత్వంలో కరువైనాయన్నారు.
సోషల్ జస్టిస్ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ , ఉదయపూర్ డెకరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని దాసు సురేశ్ ప్రశ్నించారు.. పార్లమెంటు సీట్ల పంపకంలో నైనా బీసీలకు పది సీట్లు కేటాయించాలన్నారు..
ఈ కార్యక్రమంలో ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చైర్మన్ ఆళ్ల రామకృష్ణా ,బిసి రాజ్యాధికార సమితి సెక్రటరీ సుధాకర్ , వై బాలకృష్ణ , మహిళా అధ్యక్షురాలు బోనం ఊర్మిళ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి ప్రధాన కార్యదర్శి గోశిక స్వప్న , ప్యారసాని దుర్గేష్, వైద్యనాథ్, సికిందరాబాద్ నియోజక వర్గ కన్వీనర్ బొమ్మ నరేందర్ , వరంగల్ జిల్లా కన్వీనర్ పొదిల రాజు , పన్నీరు కృష్ణ కొండా యాదగిరి, దాసు బలరాం తదితరులు పాల్గొన్నారు ..
Feb 26 2024, 10:23