TS: చర్ల:భద్రాచలం: చర్ల గ్రామపంచాయతీల లోని గ్రామాలను భూబాగాన్ని ప్రక్షాళన చేయాలనీ MRO కి వినతి పత్రాన్ని అందజేసిన CPIML
లింగాపురం, లింగాపురం పాడు,గొంపల్లి, చర్ల గ్రామపంచాయతీల లోని గ్రామాలను భూబాగాన్ని ప్రక్షాళన చేయాలి
లింగాపురంపాడు గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలి
పరిపాలన పరంగా ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు పడుతున్న ఇబందులను , అసౌకర్యాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కచ్చితంగా ఈ మార్పులు చెయ్యాలి
ప్రత్యేక పంచాయతీ ని సాధించేందుకు లింగాపురం పాడు గ్రామస్తులు యుద్ధనికి సిద్ధం కావాలి
CPIML న్యూ డెమోక్రసి జిల్లా నాయకులు ముసలి సతీష్
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్
చర్ల MRO కి వినతి పత్రం అందజేసిన నాయకులు. పరిశీలన చేస్తామని అవకాశం ఉంటే తప్పకుండా ప్రత్యేక పంచాయతిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన MRO
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీల ఆధ్వర్యంలో లింగాపురం పాడు గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని చర్ల మండల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ముసలి సతీష్ సిపిఐ ఎంఎల్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ లు మాట్లాడుతూ లింగాపురం పాడు భూ భాగాన్ని గ్రామాన్ని గొంపల్లి పంచాయతీలో సగం లింగాపురం పంచాయతీలో సగం చర్ల పంచాయతీలో సగం కలిపారని దానివల్ల ఈ లింగాపురం పాడు గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఈ గ్రామం ముక్కలు ముక్కలు రావడం వల్ల గ్రామ పంచాయితీల పేర్లు అన్ని ఇతర గ్రామాలకు ఉండడం వల్ల ఈ గ్రామం తీవ్ర అన్యాయానికి గురైందని అభివృద్ధికి నోచుకోవడం లేదని చులకన భావానికి గురవుతుందని అన్నారు ఈ గ్రామంలో 500 కు పైగా ఓటర్లు ఉన్నారని చట్టం ప్రకారం 500 ఓటర్లు ఉంటే ప్రత్యేక పంచాయతీ చేయవచ్చునని కానీ ముక్కలు చేయడం వల్ల ఈ గ్రామం గ్రామంలోని ప్రజలు ఎటు గాకుండా అయ్యారని అన్నారు పరిపాలన పరంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఈ విషయంపై పునర్ ఆలోచించి ముక్కలు చేయబడ్డ ఈ గ్రామాన్ని ఇతర పంచాయతీలను కలిపి ఇతర గ్రామ పంచాయతీల నుంచి వేరుచేసి ఒకే ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు దీనికోసం చర్ల, గొంపల్లి, లింగాపురం పంచాయతీల భూభాగాలను ప్రక్షాళన చేయాలని అన్నారు రాహుల్ విజ్ఞాన్ పాఠశాల నుంచి గొంపల్లి ఈత వాగు వరకు అట్లాగే రాహుల్ విజ్ఞాన్ పాఠశాల నుంచి లింగాపురం ఈత వాగు వరకు భూభాగాన్ని కలిపి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని అన్నారు అనంతరం ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు పునరాలోచించి ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవకాశం ఉంటే కచ్చితంగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. ప్రత్యేక పంచాయతీ సాధన కొరకు లింగాపురం గ్రామ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు రాజు రమేష్ ఉంగయ్య బద్రు నాగేష్ సమ్మక్క వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Feb 21 2024, 14:30