/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం.. Miryala Kiran Kumar
గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

ముంబై నుంచి గవర్నర్ తమిళిసై 'x ' ఖాతా హ్యాక్.. ముంబైలోని బొటెక్ వైఫె నెట్ వర్క్ వినియోగించిన దుండగుడు.. సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియని వైనం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు.. కొన్ని రోజులుగా బోటిక్ మూసివేసి ఉన్న షాప్..

బిగ్ బ్రేకింగ్ తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు...

బిగ్ బ్రేకింగ్

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ రద్ద

ఇప్పటికే 2సార్లు రద్దు అయిన పరీక్షలు 

ఇప్పుడు పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేసిన కొత్త TSPSC 

563 పోస్టులకు త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్

రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు..

రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో

నేడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్ లో గల శివాజీ విగ్రహం వద్ద ఉదయం 11-00 గంటలకు కు పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగింది.అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 

రాష్ట్రీయ శ్రీరాoసేన వ్యవస్థాపక జాతీయఅధ్యక్షులు 

జల్లెల గోవర్ధన్ యాదవ్ గారు పాల్గొన్ని మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతుంది సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రని చదవాలని భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని దేశాన్ని ధర్మాన్ని కాపాడవలిసినా బాధ్యత యువతపై ఉందని జాతీయ భావాన్ని అలవరుచుకోవాలి కోరారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, లింగస్వామి, చింత హరి ప్రసాద్ గారు, కొత్త రాములు, స్వామి, గణేష్, శాంతి స్వరూప్, మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

MEF నల్గొండ జిల్లా అధ్యక్షులు మామిడి సైదుల్ని ఘనంగా సన్మానించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

MEF నల్గొండ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు గారిని ఘనంగా సన్మానించిన. ..

 .... కట్టెల శివ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం* 

నేడు నల్గొండ జిల్లా జడ్పీ గెస్ట్ హౌస్ నందు నూతనంగా నియమితులైన ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు గారికి ఘన సన్మానం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సంగం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు గారికి శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో సంఘం అభివృద్ధికై తోడ్పడాలని మరియు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాది గారు చేపట్టిన నిరుపేద ప్రజల కోసం కృషిచేసిన ఉద్యమాలు గుండె ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ వితంతుల పింఛన్ మరియు వికలాంగుల హక్కులకై పోరాటం చేసిన గొప్ప నేత అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ప్రజల పక్షాన నిలబడాలని తెలియజేయడం జరిగింది ఎం ఇ ఎఫ్ నూతన జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు గారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మరియు ఎంఈఎఫ్ ఉద్యోగ సంఘానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పక్షాన గౌరవ శ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ చింతపల్లి నవీన్ కుమార్ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల శివతేజ 

రాష్ట్ర కమిటీ సభ్యులు పెరిక చిట్టి 

 గంట సుమన్ కట్టెల యాదగిరి కట్టెల మహేశ్వర్ సుమిత్ రమేష్ మహిళా నాయకురాలు దివి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

బీసీల కుల గణనలో తెలంగాణ రాష్ట్ర నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టం: ఓబిసి నల్లగొండ జిల్లా కార్యదర్శి నిమ్మల కృష్ణమూర్తి

బీసీల కుల గణనలో తెలంగాణ రాష్ట్ర నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టం: ఓబిసి నల్లగొండ జిల్లా కార్యదర్శి నిమ్మల కృష్ణ మూర్తి

బీసీల కుల గణన పై తెలంగాణ రాష్ట్ర నిర్ణయం ఒక చరిత్ర ఒక ఘట్టమని ఓబీసీ నల్లగొండ జిల్లా కార్యదర్శి నిమ్మల కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

బీసీల కుల గణన పై తెలంగాణ రాష్ట్ర నిర్ణయం దేశానికి ఆదర్శమని, బీసీల కులగణనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ప్రజలకు అర్థమవుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బొమ్మ గోని రవి, వంగూరి వెంకన్న, మాద నాగయ్య, దింతూరి రామచంద్రు, ఆకుల శ్రీను, లోడంగి సైదులు, నిమ్మల వీరస్వామి, బొడ్డు గణేష్, బొడ్డు రాంబాబు, వేముల నాగరాజు, చిరాబోయిన నరసయ్య, మాద నరసింహ, ఆకుల యాదయ్య, మొగుళ్ళ శీను, చిరబోయిన పరమేష్, బట్టు మల్లేష్, దీటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

TS: నల్లగొండ:నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన

నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన

నేడు నల్లగొండ కలెక్టర్ దాసరి హరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మా నగర్ లో ఉన్న పవర్ లూమ్ యూనిట్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ లూమ్ నేత ఉత్పత్తి దారులతో మాట్లాడుతూ పంచలు,లుంగీలతో పాటు,బెడ్ షీట్ల తయారీపై సైతం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు, పవర్ లూమ్ మిషన్లు డయింగ్,మార్కెటింగ్,రా మెటీరియల్,అమ్మకాలు,గిరాకీ లాభాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ మరియు జనరల్ సెక్రెటరీ కర్నాటి యాదగిరి మరియు పవర్లూమ్ సంఘం అధ్యక్షులు చెరుపెల్లి శ్రీనివాస్ మరియు పవర్లూమ్ సంఘం డైరెక్టర్లు చెరుపల్లి జయప్రకాష్, గంజి రఘురాములు, వనం చంద్రశేఖర్, కైరం కొండ చంద్రశేఖర్, చిక్కు శేఖర్, పొట్ట బత్తుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

TS: సంత్ సేవాలాల్ జన్మదిన పురస్కరించుకొని నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు శ్రీ సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకు వృద్ధులకు మరియు బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. సంతు సేవాలాల్ గారు గిరిజనుల ఆరాధ్య దైవం ఆయన గిరిజనుల కోసమై పెద్ద ఎత్తున వారికోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భిన్న వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు సంతు సేవాలాల్ గారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్ మరియు ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర సెక్రెటరీ కొర్ర రామ్ సింగ్ గారు తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ  సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ చిత్రం శ్రీను విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వంగాల బిక్షమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నవీన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు .

భద్రాచలం: చర్ల:ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి: న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి న్యూడెమోక్రసీ 

కేంద్ర పోలీసు బలగాలు వెనక్కి తగ్గాలి న్యూడెమోక్రసీ

ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమాన్ని శాంతి ఉతంగా జరగనివ్వాలి న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

నిన్నా 13 తారీకు వెలాదిగా రైతులు తరలి ఢిల్లీ సరిహద్దు పంజాబ్,హర్యానా శంభూ సరిహద్దు దగ్గర శాంతియుతంగా రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే కేంద్ర పోలీసు బలగాలు భారీకేర్డుతో అడ్డగించడం రైతాంగంపై టియర్ గ్యాస్ ఉపయోగించటాన్నీ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖండింస్తుంది

ఈరోజు నిరసనగా భద్రాద్రి జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చర్ల మండలం బట్టీగూడెం గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా CPI (ML) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ

మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతాంగానికి కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతాంగం పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉద్యమంలో రైతుల చావుకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీస్ మిశ్రాలపై కేసు నమోదు చేయాలని రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని రైతాంగం మొత్తం శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వారిపై ఉక్కు పాదం మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు అందుకే దేశవ్యాప్తంగా రైతాంగం మరియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో 16వ తారీకు నాడు గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ బంధు కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దేదించే వరకు ప్రజలు ప్రజాస్వామ్యత వాదులు ఓటు హక్కు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని వారు అన్నారు 

ఈ కార్యక్రమంలో నగేష్ బీమా రాజు నాగారత్నం జాన్సీ రూప రోజా కమల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

  

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్లోక అకాడమీ ఐఐటి మెడికల్ లో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిందని శ్లోక అకాడమీ కరస్పాండెంట్ మారం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం జాతీయస్థాయి ఐఐటి, మెడికల్ లో ర్యాంకులు సాధించిన పి. శంకర్ (96.47) బి. శివాని (95.83) ఏ యక్షేంద్ర కుమార్ (94.40) లు పర్సంటేజ్ సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటీ మెడికల్ అకాడమీలో 36 మంది విద్యార్థులు హాజరు కాగా 20 మంది విద్యార్థులు విజయం సాధించడంతోపాటు అడ్వాన్సుడు కు అర్హత సాధించారని తెలిపారు. ఇట్టి విజయానికి కారకులైన తల్లిదండ్రులు విద్యార్థులు, అధ్యాపకలు కళాశాల సిబ్బంది నీ అభినందించారు.

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో ఈరోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు.

ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు శింభూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

రహదారి పొడవునా పోలీసులను మొహరించారు. పరిస్థితిని అదుపు లోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.