అనాజిపురం గ్రామంలో గ్రామీణ భారత్ బంద్ సమ్మె విజయవంతం : సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం
బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు జరిగిన గ్రామీణ భారత్ బంద్, సమ్మె భువనగిరి మండలము అనాజిపురం గ్రామంలో ప్రజలందరూ పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేశారు...
ఈ సందర్భంగా CPM పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎదునురి మల్లేశం మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం చేయాలని అన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు, పెన్షన్ 10000 రూపాయలు అందరికీ ఇవ్వాలని అన్నారు ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే విధానాలు తీసుకొస్తుందని, ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపచేసి 200 రోజులకు పెంచాలని రోజుకు 800 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అబ్దుల్లపురం వెంకటేశం, నాయకులు ఎదునూరి వెంకటేశం, కడారి క్రిష్ణ, బోల్లేపల్లి స్వామి, MD ముస్తఫా, గంగణబోయిన బాలనరసింహా, బొల్లేపల్లి క్రాంతి, మావురం కృష్ణా, మకోలు గోపాల్ తదితరులు పాల్గొన్
Feb 18 2024, 16:36