బస్వాపురం ప్రాజెక్టు నుండి నీళ్లు వదిలి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలి: కొండమడుగు నరసింహ CPM రాష్ట్ర కమిటీ సభ్యలు
బస్వాపురం ప్రాజెక్టు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసి ముత్తిరెడ్డిగూడెం చెరువును నింపి రైతాంగానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి మండల పరిధిలో ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి సిపిఎం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక బోరుబావులు వెండిపోతున్న పరిస్థితులు ఉన్నదని అన్నారు. అనేకమంది బోరు బావుల ఆధారంగా దాదాపు 7,8 వందల ఎకరాల భూమిలో వరి, గడ్డి,సోప్ప సాగు చేసినారని తీరా నాటు బెట్టి నెల ,రెండు నెలలు గడవకముందే బోరు బావుల్లో నీళ్లు తగ్గి బోర్లు పోయలేని పరిస్థితి ఏర్పడిందని దీనితో రైతులు ఆవేదన చెందుతున్నారని గత నాలుగైదు సంవత్సరాల నుండి బస్వాపురం ప్రాజెక్టు నుండి ముత్తిరెడ్డిగూడెం చెరువులోకి తూము ద్వారా నీళ్లు రావడం వల్ల రైతాంగానికి సాగునీరు లభించిందని గత ఐదారు నెలల నుండి నీళ్లు రాకపోవడంతో ముత్తిరెడ్డిగూడెం చెరువులో రోజురోజుకు నీళ్లు తగ్గి బోరు బావులు ఎండుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వము జిల్లా యంత్రాంగం బస్వాపురం ప్రాజెక్టు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి సాగు, తాగునీరు అందించి రైతులను, ప్రజలను ఆదుకోవాలని నర్సింహ్మ కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Feb 17 2024, 22:17