TS: నల్లగొండ:నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన
నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన
నేడు నల్లగొండ కలెక్టర్ దాసరి హరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మా నగర్ లో ఉన్న పవర్ లూమ్ యూనిట్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ లూమ్ నేత ఉత్పత్తి దారులతో మాట్లాడుతూ పంచలు,లుంగీలతో పాటు,బెడ్ షీట్ల తయారీపై సైతం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు, పవర్ లూమ్ మిషన్లు డయింగ్,మార్కెటింగ్,రా మెటీరియల్,అమ్మకాలు,గిరాకీ లాభాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ మరియు జనరల్ సెక్రెటరీ కర్నాటి యాదగిరి మరియు పవర్లూమ్ సంఘం అధ్యక్షులు చెరుపెల్లి శ్రీనివాస్ మరియు పవర్లూమ్ సంఘం డైరెక్టర్లు చెరుపల్లి జయప్రకాష్, గంజి రఘురాములు, వనం చంద్రశేఖర్, కైరం కొండ చంద్రశేఖర్, చిక్కు శేఖర్, పొట్ట బత్తుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన


నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు శ్రీ సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకు వృద్ధులకు మరియు బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.
సంతు సేవాలాల్ గారు గిరిజనుల ఆరాధ్య దైవం ఆయన గిరిజనుల కోసమై పెద్ద ఎత్తున వారికోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భిన్న వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు సంతు సేవాలాల్ గారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్ మరియు ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర సెక్రెటరీ కొర్ర రామ్ సింగ్ గారు తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ చిత్రం శ్రీను విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వంగాల బిక్షమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నవీన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు .

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం
ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

ఉత్తమ్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లో ఉంది-KTR





యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయం.2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే కేటాయింపులు ఉన్నవి. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.
యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు పేర్కొన్న మాదిరిగా నిరుద్యోగ భృతి చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ సమావేశాల ముందు ప్రకటించిన మాదిరిగా సత్వరమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, గడువులోపు రెండు లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలి. యువజనులు క్రీడలు శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలి. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కొరకు ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదు. విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నవి.బడ్జెట్ లో యువతని విస్మరించడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
Feb 16 2024, 22:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.7k