TS: నల్లగొండ:నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన
నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన

నేడు నల్లగొండ కలెక్టర్ దాసరి హరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మా నగర్ లో ఉన్న పవర్ లూమ్ యూనిట్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ లూమ్ నేత ఉత్పత్తి దారులతో మాట్లాడుతూ పంచలు,లుంగీలతో పాటు,బెడ్ షీట్ల తయారీపై సైతం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు, పవర్ లూమ్ మిషన్లు డయింగ్,మార్కెటింగ్,రా మెటీరియల్,అమ్మకాలు,గిరాకీ లాభాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ మరియు జనరల్ సెక్రెటరీ కర్నాటి యాదగిరి మరియు పవర్లూమ్ సంఘం అధ్యక్షులు చెరుపెల్లి శ్రీనివాస్ మరియు పవర్లూమ్ సంఘం డైరెక్టర్లు చెరుపల్లి జయప్రకాష్, గంజి రఘురాములు, వనం చంద్రశేఖర్, కైరం కొండ చంద్రశేఖర్, చిక్కు శేఖర్, పొట్ట బత్తుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Feb 15 2024, 21:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
28.1k