భద్రాచలం: చర్ల:ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి: న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి న్యూడెమోక్రసీ
కేంద్ర పోలీసు బలగాలు వెనక్కి తగ్గాలి న్యూడెమోక్రసీ
ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమాన్ని శాంతి ఉతంగా జరగనివ్వాలి న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
నిన్నా 13 తారీకు వెలాదిగా రైతులు తరలి ఢిల్లీ సరిహద్దు పంజాబ్,హర్యానా శంభూ సరిహద్దు దగ్గర శాంతియుతంగా రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే కేంద్ర పోలీసు బలగాలు భారీకేర్డుతో అడ్డగించడం రైతాంగంపై టియర్ గ్యాస్ ఉపయోగించటాన్నీ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖండింస్తుంది
ఈరోజు నిరసనగా భద్రాద్రి జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చర్ల మండలం బట్టీగూడెం గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా CPI (ML) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ
మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతాంగానికి కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతాంగం పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉద్యమంలో రైతుల చావుకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీస్ మిశ్రాలపై కేసు నమోదు చేయాలని రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని రైతాంగం మొత్తం శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వారిపై ఉక్కు పాదం మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు అందుకే దేశవ్యాప్తంగా రైతాంగం మరియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో 16వ తారీకు నాడు గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ బంధు కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దేదించే వరకు ప్రజలు ప్రజాస్వామ్యత వాదులు ఓటు హక్కు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో నగేష్ బీమా రాజు నాగారత్నం జాన్సీ రూప రోజా కమల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Feb 15 2024, 20:51