NLG: నూతన ఎంపికైన గ్రంథపాలకులకు అభినందనలు తెలిపిన తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు
నల్లగొండ: గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైబ్రేరియన్ పోస్టులపై, రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రక్రియ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం ఎంతో శుభసూచకమని గ్రందపాలకుడు డాక్టర్ రాజారామ్ అన్నారు.
సాధించుకున్న తెలంగాణలో గ్రంథాలయాల సేవలు గ్రంథ పాలకుల ద్వారా సాధ్యమని, విద్యార్థుల డెవలప్మెంట్ గురించి పోటీ పరీక్షలపై అవగాహనను కల్పించడం కొరకు జ్ఞానాభివృద్ధి కోసం గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడుతాయని డాక్టర్ రాజారామ్ తెలిపారు. ఈరోజు నల్గొండలో తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ రాజారామ్ (మహిళా కళాశాల గ్రంథ పాలకులు), డాక్టర్ దుర్గాప్రసాద్ (నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకులు) నూతనంగా ఎంపికైన గ్రంథపాలకులను అభినందించారు.






నల్గొండ పట్టణంలోని మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే క్రమంలో ఉదయం మరియు సాయంత్రం పూట విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకుగాను, ఈరోజు లయన్స్ క్లబ్ ఎస్పిటి ప్లాటినం నల్గొండ సభ్యులు మరియు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ - ఆండాలు వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్ జెల్లా దశరథ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల రూపాయల స్నాక్స్ అందజేశారు.












నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.






Feb 16 2024, 10:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.4k