NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని లకు ఆరోగ్య అవగాహన సదస్సు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఉమెన్ సేఫ్టీ మరియు జువాలజి డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత విభాగపు కన్వీనర్ డాక్టర్ భాగ్యలక్ష్మి నిర్వహణ లో మంగళవారం కళాశాల విద్యార్థినులకు " రిప్రొడక్టివ్ హెల్త్ హైజిన్ మరియు ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కాన్సర్ " అనే అంశం మీద మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రఖ్యాత గైనకాలజిస్టులు డాక్టర్ సుచరిత, డాక్టర్ దీప్తి మాట్లాడుతూ.. రిప్రొడక్టివ్ హెల్త్, మెనుస్ట్రునల్ హెల్త్ హైజీన్ మరియు కాన్సర్ ముందస్తు గుర్తింపు లక్షణాలు, నివారణ, బ్రెస్ట్ కాన్సర్, సర్వైకల్ కాన్సర్ మొదలైన అంశాలపై విద్యార్థిని లకు అవగాహన కల్పించారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించి విద్యార్థినులకు వివిధ అంశాలమీద అవగాహన కల్పించినందుకు డాక్టర్ సుచరిత, డాక్టర్ దీప్తి లకు కళాశాల ప్రిన్సిపాల్ కార్యక్రమ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునీర్, జువాలజి విభాగాధిపతి శ్రీనాథ్ పటేల్, మహిళా అధ్యాపకులు దీపిక, జ్యోత్స్న, శివరాణి, శిరీష, సావిత్రి, సరిత, మహేశ్వరి, రమ, స్రవంతి, శ్వేత, వాణి, గాయత్రి, సంతోష్, ప్రవీణ్ మరియు విద్యార్థినులు హాజరయ్యారు.
Feb 14 2024, 08:02