NLG: ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు, వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, జిల్లా కార్యదర్శి, లింగయ్య యాదవ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కాగా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించారా ?పరిష్కరించలేదా? దరఖాస్తుదారానికి నెల రోజుల లోపు అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, రాతపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులకు రాతపూర్వకమైన సమాధానం ఇవ్వాలని పలువురు ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తుదారులు అంటున్నారు.





























Feb 13 2024, 19:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
87.4k