NLG: అనుమానాస్పదంగా ఉన్న విద్యార్థుల మరణాలను హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారా న్యాయ విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎస్డి
దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ వస్కుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల అనుమానస్పద మృతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్డీవోకు మెమోరండం అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థుల సూసైడ్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రతి గురుకులాల హాస్టల్ కు ఒక సైకాలజిస్ట్ను నియమించాలని,
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.
మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వం చాలా పకడ్బందీగా గురుకులాల హాస్టల్స్ విద్యార్థులు భయభ్రాంతులకు గురికాకుండా, వారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా, భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, గురుకులాల హాస్టల్లో మనో ధైర్యంతో చదివే విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, చేపూరి రాజేష్, యాదగిరి, నాగరాజు, తదితర సభ్యులు పాల్గొన్నారు.
Feb 13 2024, 07:06