NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినీలకు మీడియా, సినిమాటోగ్రఫీ పై ప్రత్యేక శిక్షణ
నల్లగొండ: ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు నీలగిరి నిపుణ సౌజన్యంతో.. మీడియా, సినిమాటోగ్రఫీ సంబంధిత 30 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు. అందుకు సంబందించిన పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ మహిళ కళాశాల విద్యార్థులకు 30 రోజులపాటు డిజిటల్ సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ స్కిల్స్, ఆడియో ప్రొడక్షన్, నాన్ లీనియర్ ఎడిటింగ్, ప్లే బ్యాక్ లైవ్ సింగింగ్ స్కిల్స్, డిజిటల్ డిజైనింగ్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్ డిస్క్ జాకీ మరియు లైవ్ సౌండ్ తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పేస్ సీఈఓ శశి ప్రీతం , టీవీ సీరియల్ మరియు సినిమా నటుడు లోహిత్ కుమార్, మాట్లాడుతూ.. ఈ రంగాలలో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యం కల్పించడం జరుగుతుందని కళాశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని, ఈ రంగాలలో తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరు కాబట్టి, ఇటువంటి రంగాలలో నైపుణ్యత సాధించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, హౌసింగ్ బోర్డ్ పిడి రాజకుమార్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ నరసింహారాజు, మెంబర్స్ డాక్టర్ సుంకరి రాజారామ్, జి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2024, 22:18