NLG: ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె ను జయప్రదం చేయండి: చాపల శ్రీను
మునుగోడు: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షులు చాపల శ్రీను పిలుపునిచ్చారు. సీపీఐ కార్యాలయం లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కేంద్రం గత 10 సం.ల పాలనలో దేశంలో కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు.
బిజెపి అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని అన్నారు. కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో జరిగిన రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వలన జరుగుతున్న నష్టంపై ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షకార్యదర్షులు బెల్లం శివయ్య, దుబ్బ వెంకన్న , భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు ఈద యాదయ్య ఇతర రంగాల కార్మిక నాయకులు దొమ్మటి గిరి, బోల్లు సైదులు, మద్ది అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2024, 21:45