NLG: కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుత్త అమిత్ రెడ్డి
ఈ నెల 13 న నల్గొండ లో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి అన్నారు. నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కె ఆర్ ఎం బి లో జరిగిన మీటింగ్స్ లలో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని,కృష్ణా నది మన జిల్లాకు వరప్రదాయిని 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అలాంటి కృష్ణా జలాలను కేంద్రానికి అప్పజెప్పారు అని విమర్శించారు.
కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుందని, మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం అని,ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్య, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ పై పై బురద జల్లుతున్నారు అని, పదేళ్లు ఎంత ఒత్తిడి చేసిన కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు.
పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గ లాలల్లో ఎక్కడినుంచైన పోటీ చేస్తాను, పార్టీ నిర్ణయమె ఫైనల్..
ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజల్లో ఉండటమే నాకు ఇష్టం అన్నారు. ఈ కార్యక్రమములో జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం, అయితగాని స్వామి గౌడ్,శ్రీరామదాసు హరి కృష్ణ,నాగులవంచ వెంకటేశ్వర రావు,కంచరకుంట్ల గోపాల్ రెడ్డి ,పజ్జుర్ సర్పంచ్ మోయిజ్, మాజి జడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2024, 12:02