నేడు జేఈఈ మెయిన్ -1 ఫలితాలు
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి.
ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్ -1 ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థు ల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. సోమవారం ఫలితాలతోపాటు తుది కీ"ని సైతం ఎన్టీఏ విడుదల చేయనున్నది.
దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ -1 పరీక్షలు జరిగాయి.పేపర్ -1కు 12, 21,615 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,036 (95.8 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.
ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆరిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీ ప్లానింగ్, వంటి సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 55,493,75శాతం, మంది పరీక్షకు హాజరయ్యారు.
ఈ ఫలితాల కోసం https://jeemain.nta.ac.inను సంప్రదించండి
Feb 12 2024, 11:59