/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుత్త అమిత్ రెడ్డి Mane Praveen
NLG: కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుత్త అమిత్ రెడ్డి

ఈ నెల 13 న నల్గొండ లో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి అన్నారు. నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కె ఆర్ ఎం బి లో జరిగిన మీటింగ్స్ లలో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని,కృష్ణా నది మన జిల్లాకు వరప్రదాయిని 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అలాంటి కృష్ణా జలాలను కేంద్రానికి అప్పజెప్పారు అని విమర్శించారు.


  

కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుందని, మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం అని,ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్య, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ పై పై బురద జల్లుతున్నారు అని, పదేళ్లు ఎంత ఒత్తిడి చేసిన కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు.

పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గ లాలల్లో ఎక్కడినుంచైన పోటీ చేస్తాను, పార్టీ నిర్ణయమె ఫైనల్..

 ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజల్లో ఉండటమే నాకు ఇష్టం అన్నారు. ఈ కార్యక్రమములో జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం, అయితగాని స్వామి గౌడ్,శ్రీరామదాసు హరి కృష్ణ,నాగులవంచ వెంకటేశ్వర రావు,కంచరకుంట్ల గోపాల్ రెడ్డి ,పజ్జుర్ సర్పంచ్ మోయిజ్, మాజి జడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ జిల్లాకు కెసిఆర్ చేసింది ఏమీ లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: జిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్ ఎల్ బి సి ని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కెసిఆర్ మాట తప్పాడని, సభలో నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కెసిఆర్ ప్రసంగించాలని, కెసిఆర్ మాట తప్పడంపై నల్లగొండ పట్టణంలో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని అన్నారు.

నల్లగొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఅర్..

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి..

కేసీఆర్ కోసం కుర్చీ ,పింక్ టవల్ ఎల్ ఈడి స్క్రిన్ ను పోలీసు పర్మిషన్ తో పెడతాం..

రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది..

కేఆర్ఎంబి ఫైళ్ల పై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు..

బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించాం..

కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

  

SRPT: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

సూర్యాపేట: మండలంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మ ల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శనివారం సాయంత్రం ఫేర్వెల్ డే లో పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి గదిలోకి వెళ్ళిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారక స్థితిలో ఉంది. సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి ఘనంగా అభిషేకాలు

నల్గొండ: పట్టణంలోని హనుమాన్ నగర్ పాత బస్తి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో 4వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా, ఈ రోజు ఉదయం మండప దేవత పూజలు, హోమాలు చేయడం జరిగింది.

18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి మహాస్నాపనము అని 36 జలాలతోని, ధాన్యాలతోని స్వామివారికి అభిషేకము మహాస్నాపనము చేయడం జరిగింది.

*కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి* : *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం*

కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు..

       శుక్రవారం సిపిఎం చండూరు మండల కమిటీ సమావేశం సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కేరళలో విపత్తులు, కష్టకాలంలో కూడా సహాయం చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం ఆదాయం ఉత్పత్తి లో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన సంక్షోభం ఏర్పడిందన్నారు. 2021- 22 లో కేరళ రుణ పరిమితి తగ్గించిందని అన్నారు.

జీఎస్టీ వంటి ఆదాయ వనరును తగ్గించిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడి ,సిబిఐ ,ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రం జోక్యం చేసుకొని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ జోక్యం చేసుకొని మితిమీరి వ్యవహరించడం ,ప్రభుత్వ పని విధానం పై ప్రభావం పడుతుందని అన్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం విద్విశ్ పూరిత వైఖరి అవలంబించడం సరికాదని ఇది మేధావులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని వారన్నారు..

 

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల కమిటీ సభ్యులుకొత్తపల్లి నరసింహ, సిపిఎం నాయకులుకంచర్ల రవి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు

YDD: పంతంగిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా, చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకు శివప్రసాద్ శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న నీటితొట్లను శుభ్రపరిచి వాటి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోయ ఇందిర సంజీవ, సీహెచ్వో జ్యోతి పాల్గొన్నారు.

NLG: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి

నెహ్రు యువ కేంద్రం నల్గొండ మరియు నల్లగొండ కి చెందిన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంఘం ఆధ్వర్యంలో శక్రవారం మహిళా డిగ్రీ కాలేజీ సెమినార్ హాల్ లో ఎయిడ్స్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవవాని ముఖ్య అతిధిగా విచ్చేసి యువత ఇలాంటి అవగాహన సదస్సులను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. యువత తమ తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.  

లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంఘం నల్గొండ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధాకర్, సంపతయ్య వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాస రచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి మొదటి, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ సదస్సులో జిల్లా ఎన్ వై కే యువజన అధికారి ప్రవీణ్, కళాశాల గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ సరిత, శైలజ, వనజ అధ్యాపకులు స్వామి, డాక్టర్ మట్టయ్య మరియు కొండా నాయక్, నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ నుండి 9 మంది అభ్యర్థులు దరఖాస్తు

నల్లగొండ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నుండి 9మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, యరగాని నాగన్న, పాశం నర్సిరెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, ఏలగందుల రాము, జైపాల్ రెడ్డి, వల్లి నారాయణ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

NLG: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన.. బాలికల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

నల్లగొండ: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద.. ఇటీవల భువనగిరిలో ఎస్సీ హాస్టల్ బాలికల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగరాజు, పిపిఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి, కంజెర శ్రీను, కత్తుల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

NLG: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్ హరిచందన

నల్లగొండ: రాబోయే ఐదు నెలలు అప్రమత్తంగా ఉంటూ త్రాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. పానగల్ లోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళిక గురించి తెలుసుకున్నారు. అన్ని గ్రామాలకు ప్రతి రోజూ నీటి సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇఇ వంశీ కృష్ణ, ఏఈ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.