రాజపేట లో జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని తరలించవద్దని తహసిల్దార్ కు బీఆర్ఎస్ నేతల వినతి
జిల్లాకు మంజూరైన మెడికల్ మంజూరైన మెడికల్ కాలేజీని తరలించొద్దని రాజాపేట మండల బిఆర్ఎస్ నాయకులు తాహసిల్దార్ దామోదర్ కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అహర్నిశలు కష్టపడి అప్పటి వైద్యశాఖ మంత్రి సహకారంతో యాదాద్రి జిల్లాకు వైద్య కళాశాల మంజూరి అయిందని అన్నారు. దీనికోసం సుమారు 182 కోట్ల నిధులు కూడా ఉన్నాయని అన్నారు . ఎన్నికల కోడ్ రావడం వల్ల శంకుస్థాపన కార్యక్రమం ఆలస్యం అయిన సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హ కళాశాలను వేరే జిల్లాకు తరలించకపోవడం అనే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.కలశాల తరలింపు చర్యలు మానుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, మండల పార్టీ ప్రెసిడెంట్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ సంధిల భాస్కర్ గౌడ్, సట్టు తిరుమలేష, పల్లె సంతోష్ గౌడ్, జస్వంత్, గుర్రం నరసింహులు, కటకం స్వామి,తదితరులు పాల్గొన్నారు
Feb 09 2024, 23:14