/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రాష్ట్ర పోటీలకు పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ఎంపిక Raghu ram reddy
రాష్ట్ర పోటీలకు పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ఎంపిక

ఈనెల 10న భద్రాద్రి కొత్త గూడెంలో జరిగే రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీ లకు పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ బాలుర పాఠశాల, ఎంపీ యుపిఎస్ విద్యార్థులు వర్షిణి, కావేరీ ఎంపిక య్యారు.

జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో షాట్ పుట్, 600 మీటర్ల పరుగు పోటీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించగా, శుక్రవారం ఎంఈఓ, హెచ్ఎం సురేంద్ర కుమార్, ప్రైమరీ హెచ్ఎం మంజులత అభినందిం చారు

Vijayawada: గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు

శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ మళ్ళిస్తూ సీపీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్బీ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వస నీయ సమాచారం.దీంతో నిరుడు అక్టోబర్‌ 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలనే ఫైనల్‌ చేస్తూ.. నేడో, రేపో టీఎస్‌ఎల్‌పీఆర్బీ తుది ప్రకటన చేయనున్నది.

జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. నిపుణుల కమిటీ వేయా లన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికా రులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్చు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ నిరుడు అక్టోబర్‌ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్‌ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకో వాలంటూ రాష్ఱ్రహోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధి కారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు, ఇతర లేఖలు వెళ్లాయి. డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకూ లైన్‌క్లియర్‌ అయినట్టు సమాచారం.

బోర్డు నుంచి సరైన వివరణ

సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్‌ ఇచ్చిన దగ్గర్నుంచి..తుది ఫలితాలు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని, సాంకేతి కంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకొన్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు.

దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా.. బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు

ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి, కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు

మాజీ ముఖ్యమంత్రి శరత్ పవార్ కు ఈసి షాక్

లోక్ సభ ఎన్నికలు దగ్గర కొస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది.

ఎన్నికల సంఘం మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ,ఎన్‌సీపీ,గా అధికారి కంగా గుర్తించింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది.

శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ తెలిపింది

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తు న్నట్లు ఈసీ పేర్కొంది. పార్టీ సింబల్ అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది

నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఇవాళ చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళాను న్నారు. పొత్తులపై చర్చించ డానికి ఢిల్లీ రమ్మని చంద్ర బాబుకి అమిత్ షా ఆహ్వానం పంపారు

ఈ రాత్రికి అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు.చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

టీడీపీతో పొత్తు పెట్టుకోవా లని హైకమాండు కు ఇప్ప టికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచించారు

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం

వ్యూహం చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

వ్యూహం సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా

ఇరువైపులా ముగిసిన వాదనలు

ఈ నెల 9వ తేదీ లోగా సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

విద్యారత్న అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు శాంతిలత

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న శాంతి లత కు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేఐసి స్వేచ్ఛాంద సంస్థ ప్రకటించిన విద్యారత్న అవార్డును మంచిర్యాల జిల్లా సీనియర్ అడ్వకేట్ KV, ప్రతాప్ ఆదివారం అందజేసి సాలువతో ఆమెను ఘనంగా సన్మానించారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని నస్పూర్ కాలనీ నరసయ్య భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జేసీఐ 3వ ఇన్ఫోలేషన్ శిరోమణి సెమినార్ ను జెసిఐ చైర్మన్ అరుముళ్ల రాజు. ఆధ్వర్యంలో నూతన జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్ నాయకత్వంలో సెమినార్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ జోన్ ప్రెసిడెంట్ గోవింద్ డాక్టర్ వెంకటేష్ పాలాకుల విపి ఆయుష్ కంపటి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గావిచ్చేసిన మంచిర్యాల జిల్లా ఎంప్లా యిమెంట్ ఆఫీసర్ కౌశిక వెంకట్ రమణహాజరై ఆయన ప్రసంగించారు

విద్యారత్న అవార్డుకు ఎంపికైన శాంతిలతను ఆమె బంధువులు స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడునిసత్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

భారత మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషన్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు చెప్పి సన్మానం చేశారు

అంతేకాదు ఫిబ్రవరి 4వ తేదీన పద్మ పురస్కార విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మాన కార్యక్రమం ఉంటుందని దానికి తప్పక హాజరు కావాలని వెంకయ్యను మంత్రి ఆహ్వానించారు

అంతేకాదు ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవినీ జూపల్లి కలిశారు అనం తరం శుభాకాంక్షలు చెప్పి శాలువాతో సత్కరించారు సత్కార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు

కాగా ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ సినీనటుడుమెగాస్టార్‌ చిరంజీవి ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తోపాటు

సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య కేతావత్‌ సోమ్‌లాల్‌శిల్పకారుడు స్తప‌తి ఆనందాచారిని రాష్ట్ర ప్రభుత్వం ఘ‌నంగా స‌త్కరించ‌నుందిఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హ‌రికృష్ణ ఉన్నారు

దూకుడు పెంచిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు

స్కూల్ బస్‌లు ఆటోల ఫిట్‌నెస్ చెక్ చేయడంతో పాటు ఇన్స్యూరెన్స్ డ్రైవర్ ట్రాక్‌ను చెక్ చేస్తున్నారు స్కూల్ వాహనాలపై గతంలో ఏమైనా యాక్సి డెంట్ కేసులు నమోదు అయ్యాయా డ్రైవర్‌పై చరిత్రపై ఆరా తీస్తున్నారు

అలాగే సదరు వాహనాల పెండింగ్ చలాన్లను పరిశీలి స్తున్నారు. ఇన్స్యూరెన్స్ క్లియర్ చేయని వాహనా లను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఈ స్పెషల్ డ్రైవ్ 10 గంటలవరకు కొనసాగింది

తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మరోసారి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు