విద్యార్థుల మరణాలపై విచారణ వేగవంతం చేయాలి: కొత్తపల్లి ఆనంద్ యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు
ఇటీవల ఆత్మహత్యలకు గురైన మైనర్ విద్యార్థులు భవ్యశ్రీ , వైష్ణవి మరణాల విచారణ వేగవంతం చేసి, కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, బాదిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర లకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ ..ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన కోడి భవ్య శ్రీ , గాదె వైష్ణవి లకు ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ఎక్స్గ్రేషియా వెంటనే ఇప్పించాలని , మరణాలపై ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్ , జిల్లా నాయకులు వేల్పుల యాదమల్లయ్య , వడిచెర్ల కృష్ణ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు ఊదర నరసింహ యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, డేగల అంజయ్య యాదవ్, మూటకొండూరు మండల అధ్యక్షులు మాధరబోయిన నరేష్ , జిల్లా ఉపాధ్యక్షులు రాజు, రాసాల లింగస్వామి, బీబీనగర్ మండల అధ్యక్షులు సాయికుమార్ యాదవ్, వలిగొండ మండల అధ్యక్షులు వనగంటి వెంకటేశ్ యాదవ్ ,రాసాల వినోద్ యాదవ్, బీన బోయిన కుమార్ యాదవ్ , మేకల బాలు యాదవ్ , గుండె బోయిన శంకర్ యాదవ్ పాల్గొన్నారు.
Feb 09 2024, 17:59