కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ విధానాలను ప్రతిఘటిద్దాం :ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్
కేంద్రలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశంలో కార్మిక, రైతు, సమాన్య ప్రజలను విస్మరించి బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనం కోసం ఎర్ర తివాచీ వేసి పాలన కొనసాగిస్తుంది అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆరోపించారు.
గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముద్రించిన సమ్మెకు సంబందించిన గోడ పత్రికలను ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పరెట్ సంస్థల కోసం మోడీ ప్రభుత్వం 2.14 లక్షల కోట్ల బ్యాంకు అప్పులు మాఫీ చేసిందని, 2019నుండి 2022 వరకు 1 శాతం ఉన్న బడా వర్తకుల ఆదాయం 30 శాతం అభివృద్ధి అయంది కానీ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ వర్కరల కు కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి అని, ఆటో డ్రైవర్లకు జీవనభృతి నెలకు పదివేలు ఇవ్వాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు నెలకు పదివేల వేతనం ఇవ్వాలని, పి. ఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాడ్యుటి, పెన్షన్, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ల పరం చేస్తున్నదని వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలను అమ్ముతున్నదని అన్నారు. కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధికలు పాలసీధాలుగా ఉన్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు దిగబడిందని అన్నారు, సి పి ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ను నియమించకుండా జాప్యం చేస్తుందని అన్నారు.ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించి ప్రతి వ్యక్తికి 200 రోజుల పని 600 రూపాయలు రోజువారి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు కోటు మంది పనిచేస్తున్న కేంద్ర స్కీములకు ప్రభుత్వ నిధుల్లో కోత పెట్టిందని కనీస వేతనాలు చెల్లించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని అన్నారు.కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ పాలన లో జరిగిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు వలన జరుతున్న నష్టం పై ఫిబ్రవరి 16 న దేశ వ్యప్తంగా సమ్మె లో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మె లో పాల్గొని జయప్రదం చేశాల అందరూ కృషి చెయ్యాలి అని అన్నారు.
ఈ కారిక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు ఎడ్ల నరేష్, జిన్న కృష్ణ, పాండు, రమేష్, ఉపేందర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Feb 08 2024, 23:29