ఈనెల 18న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లను జయప్రదం చేయండి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు
వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ జయప్రదం కోరుతూ.. కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఈ నెల18వ తేదీన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు .అదే విధంగా అధ్యయనం పోరాటం నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెన్ను తట్టి వెలికి తీసే విధంగా ప్రోత్సహిస్తు విద్యార్థుల సమస్యల పరిష్కారం కి అనునిత్యం ఉద్యమిస్తు ...విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడాలని ఎస్ఎఫ్ఐ గుర్తుచేస్తూ.... త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు మిమ్మల్ని సిద్ధం చేసేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టు పరీక్షలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వేముల జ్యోతిబాస్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మిర్యల శ్రావణ్ కుమార్,జమీల,రూప ఉపాధ్యాయులు,విద్యార్థలు తదితరులు పాల్గొన్నారు
Feb 08 2024, 20:16