YDD: అనుమానాస్పద స్థితిలో విద్యార్థుల ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి: మేడి ప్రియదర్శిని
ప్రభుత్వం విద్యార్థినులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఇవ్వాలి
బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతి పై బీఎస్పీ నకిరేకల్ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులను కౌన్సెలింగ్ పేరుతో పిఈటి, వార్డెన్, ఆటో డ్రైవర్ కలిసి నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసినారని, కనీసం తల్లిదండ్రులకు తెలియజేయలేదని, కౌన్సిలింగ్ పేరుతో విద్యార్థులు మనస్థాపానికి గురయ్యారని అన్నారు.
జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించకపోవడం, కనీసం పరామర్శించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకుని ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Feb 07 2024, 20:02