ఏఐఎస్ఎఫ్ ,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ ముట్టడి
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సమస్యలు పరిష్కరించాలని ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా ...అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్ ,పెరబోయిన మహేందర్ లు మాట్లాడుతూ ...బీబీనగర్ లోని ఎయిమ్స్ లో అలాగే యాదాద్రి దేవస్థానంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జిల్లాలో ఉన్న పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఈ జిల్లాలో డ్రగ్స్ గంజాయిని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వస్తూపుల అభిలాష్ ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ..యాదాద్రి దేవస్థానం నిధులతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని . పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో జరిగిన ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ముట్టడి కార్యక్రమం కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత కొనసాగింది పోలీసులు విద్యార్థి ,యువజన నాయకుల మధ్య తోపులాట జరిగింది కలెక్టరేట్ లోనికి ప్రదర్శనగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .వారు సానుకూలంగా చదివి విన్న తర్వాత స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి నహీం సుద్దాల సాయి ,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సూరారం జానీ ,ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల వెంకటేష్ ,కంబాల రాజు ,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మారుపాక లోకేష్, ఎం జానీ దినేష్ ,కళ్యాణ్ ,సాయి చరణ్, సుమన్, ప్రవీణ్ ,ప్రణయ్ ,రవితేజ ,దుర్గాప్రసాద్ ,సుమన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Feb 06 2024, 23:13