NLG: ఎంపీ బరిలో జానారెడ్డి తనయుడు.. గెలిపించుకుంటామన్న స్థానిక నాయకులు
నల్లగొండ: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి చిన్నకుమారుడు జయవీర్ రెడ్డి, ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్ లో తన అన్న రఘువీర్ రెడ్డి తరపున అప్లికేషన్ అందజేశారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కూడ ముగియడంతో 6న పిసిసి ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించనుందని సమాచారం, నల్లగొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సన్నిహితుడు గా ఉంటూ ప్రజల మన్ననలను పొందారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేరొందిన యువ నాయకుడు గా గుర్తింపు పొందారు. బడుగు బలహీన వర్గాల ప్రజల మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి తమ్ముడు జయవీర్ రెడ్డి అధిక మెజార్టీ తో గెలిచారు. ఇదే తరహాలో రఘువీర్ రెడ్డికి కూడా ఎంపీ టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలందరూ సన్నద్ధమై అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించుకుంటామంటున్నారు
ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షులు కెలావత్ నగేష్ నాయక్ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించినట్లయితే విజయం సాధించడానికి తామంతా కృషి చేసి గెలిపించుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Feb 06 2024, 21:13