NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2023-24 విద్యా సంవత్సరం నుండి స్వయం ప్రతిపత్తి పొందినది. కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చిన తరువాత మొదటి సారిగా మొదటి సెమిస్టర్ పరీక్షలు 2023 డిసెంబర్ లో నిర్వహించటం జరిగినది. ఈ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం నాడు కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యాం, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి (COE) డాక్టర్ ఆర్. నరేష్ ల సమక్షంలో మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ G. ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు.
విద్యార్థినిలు కళాశాల వెబ్ సైట్ (https://gdcts.cgg.gov.in/ramagiri.edu) లో ఫలితాలు పొందవచ్చని వారు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 766 విద్యార్థినిలు హాజరు కాగా, 267 మంది ఉత్తీర్ణులు కాగా 499 మంది విద్యార్థినిలు ప్రమోట్ అయినట్లు పేర్కొన్నారు. కళాశాల మొత్తం ఉత్తీర్ణత 34.86% గా ఉండగా బి. కామ్ విభాగంలో అత్యధికంగా 50.25% ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. పునర్ మూల్యాంకనం (రీ వాల్యుయేషన్) ప్రకటన త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి (ACOE) త్రిపురం భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె.దేవవాణి, లైబ్రేరియన్ డాక్టర్ యస్. రాజారామ్, వివిధ విభాగాల అధిపతులు, పరీక్షల విభాగ సభ్యులు, పరీక్షల నియంత్రణ అధికారి (COE) కార్యాలయం సిబ్బంధి సునీత, వహీద్, అలివేలు పాల్గొన్నారు.
Feb 06 2024, 11:58